Tuesday, April 16, 2024

26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: గుణాత్మకమైన బోధన కోసం రాష్ట్రంలో 26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతుల కల్పనకై దృష్టి సాధించారని తెలిపారు. ఆయన మంగళవారం ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గిప్ట్ ఎస్మైల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 2 వేల మంది విద్యార్థులకు రూ.86 వేల విలువైన ఆకాష్ బై జూస్ సాప్ట్‌వేర్ ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సిఎస్‌అర్ ఆర్థిక సహకారంతో పంపిణీ చేస్తున్న ట్యాబ్‌లు విజ్ఞాన సమపార్జనకు సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ను అగ్రభాగాన నిలబెట్టాలని విద్యార్థులకు హిత బోధ చేశారు. ఉన్నత లక్షాలను సాధించడం కోసం రూపొందించిన సాప్టవేర్‌ను బోధన అంశాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. గత నెలలో వేములవాడ లో వె య్యి మందికి ట్యాబ్‌లు అందించినట్లు పేర్కొన్నారు.

జిల్లా లో మరో 3 వేల మందికి ట్యాబ్‌లను పంపిణీ చేయనున్న ట్లు ప్రకటించారు. ఐఐటి, నీట్, ఎంసెట్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించామని, పిల్లల ముఖాలలలో చిరునవ్వు చూడాలన్నదే తన అకాంక్ష అన్నారు. కార్పొరేట్ సంస్థల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దగలమన్నారు. రూ.7 కోట్ల వ్య యంతో నిర్మిస్తున్న ఎల్లారెడ్డిపేట ఉన్నతపాఠశాల భవన సముదాయాన్ని మూడు మాసాలలో పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. రూ2 కోట్ల ఖర్చు చేసి వేణు గోపాల స్వా మి ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు తెలిపారు.

సిఎం కెసిఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో గంభీరావుపేట కెజి టు పిజి విద్యా సంస్థలను ప్రారంభించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల మైదానాన్ని అనుకున్న స్థాయిలో పూర్తి చేయలేదని విచారం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో సిరిసిల్ల 2వ, పెద్దపల్లి 3వ స్థానం పొందటం గర్వకారణమన్నారు. ఇం దుకు కృషి చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రభుత్వ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. నీటి సంరక్షణ చర్యల్లో సిరిసిల్లలో భూగర్భ జలాలు పెరిగిన వైనం ఐఎఎస్, ఐపిఎస్ ట్రైనీలకు పాఠ్యాంశమైనట్లు వివరించారు. విద్యా వ్యవస్థ బాగు పడితే అన్నిరంగాలు అభివృద్ధి చెందగలవన్నారు.

మండల కేద్రంలో ఏర్పాటు చేసి న వయో వృద్ధుల కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడ కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. వృద్ధులను అక్కున చేర్చుకొని వారి జీవితాలకు భరోసా ఇచ్చారు. రాగట్లపల్లి, బొప్పాపూర్, వెంకటాపూర్‌లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. గొల్లపల్లిలో రేణుకా ఎల్లమ్మ కల్యాణ ఉత్సవాలకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్నారు, పూజారులు తీర్థ ప్రసాదాలు అంద చేసి ఆశీర్వదించారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి ఆరోగ్య బాగోగులను తెలుకుంటూ ఆరు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అంతకు ముందు విద్యార్థినిలతో ముచ్చటిస్తూ వారి భవిష్యత్ ఆశయాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News