Wednesday, April 24, 2024

చిన్నారి మిషిత సహాయం గొప్పది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టినరోజు కానుకను కరోనా నియంత్రణ కోసం సిఎం సహాయనిధికి విరాళం ఇచ్చిన చిన్నారి మిషిత గొడిశలను రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. వయస్సు చిన్నదైనా మనస్సుపెద్దగా చేసి కరోనాను తరిమివేసేందుకు తమవంతు సహాయం చేసిన మిషిత ఎందరో చిన్నారులకు ఆదర్శంగా నిలిచిందని కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే కువైట్ టిఆర్‌ఎస్ విభాగం అధ్యక్షురాలు అభిలాష, ఎన్‌ఆర్‌ఐ సురేష్‌గౌడ్ కూతురు మిషిత. కువైట్‌లో మిషిత రెండవ తరగతి చదువుతుంది. కరోనా వార్తలు రోజువింటూ కలత చెందిన మిషిత కరోనా నియంత్రణ కోసం తనవంతు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ చిన్నారి తన ఆలోచనను కార్యరూపంచేయాలనుకుంది. తన పుట్టినరోజున ఎవరూ కానుకలు ఇవ్వవద్దని కరోనా నియంత్రణకు విరాళాలు ఇవ్వాలని తోటి స్నేహితలకు చెప్పింది. అయితే పుట్టిన రోజు కానుకగా ఏమి కావాలని తల్లితండ్రులు అడగ్గా నాకు కానుకలు వద్దు కానుకలకు ఖర్చుచేసే డబ్బు సిఎం కెసిఆర్ సహాయనిధికి విరాళంగా ఇచ్చి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని తల్లి తండ్రులను కోరింది.

మిషిత తీసుకున్న ఈ నిర్ణయానికి తల్లితండ్రులు ఎంతగానో సంతోషించి రూ.10వేలు సిఎం సహాయనిధికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న కెటిఆర్ మిషిత మనసు గొప్పదని పేర్కొంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మనకోసం, మనఆరోగ్యం కోసం, కరోనాను తరిమివేసేందుకు వైద్యసిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా కరోనాను తరిమివేయాలని ఆలోచిస్తున్నారని కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వీరంత చేస్తున్న కృషి ఫలించాలంటే ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటించి ఇళ్లకే పరిమితం కావాలని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వ్యక్తిగత శుభ్రత, స్వీయ నియంత్రణ, సామాజిక దూరం మర్చి పోవద్దని ఆయన గుర్తు చేశారు.

KTR Appreciate to Child Mishita donates to CM Relief Fund

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News