Home తాజా వార్తలు గచ్చిబౌలిలోని పురాతన బావి పునరుద్ధరణ

గచ్చిబౌలిలోని పురాతన బావి పునరుద్ధరణ

Gachibowli Stepwell

 

చిరెక్ ఇంటర్నేషనల్‌ను, ఇతర బృందాలను అభినందించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : గచ్చిబౌలిలోని పురాతన బావి పునరుద్ధరణకు సంబంధించి ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ సహా ఇతర బృందాన్ని మంత్రి కెటిఆర్ అభినందించారు. ఇదే విషయాన్ని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్.. మంత్రి కెటిఆర్‌కు ట్యాగ్ చేయగా.. ఆయన రీ ట్వీట్ చేస్తూ మంచి పని చేశారని కితాబిచ్చారు. గచ్చిబౌలిలోని పురాతన బావిని పునరుద్ధరించా రు. అసఫ్ జాహి కాలంలో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ఈ బావి కారణంగానే గచ్చిబౌలి అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. కాలక్రమేణ సరైన సంరక్షణ, నిర్వహణ లేని కారణంతో బావి పాడుబడింది. చుట్టూ సంరక్షణ గోడలు కూలిపోయి చెత్తాచెదారంతో నిండిపోయింది. ఆ దశలో బావి పునరుద్ధరించాలని రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహె సంస్థలు సంకల్పించాయి.

ఇందుకు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్థిక సహాయాన్ని అందించింది. తద్వా రా దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన బావి కొత్త జీవం పోసుకుంది. ఇందులో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. చిరెక్ యాజమాన్యం ఆసక్తితో ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పుడూ తీసుకుంటుందని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇఫ్పత్ ఇబ్రహీం తెలిపారు. తమ పాఠశాలలో సిఎస్‌ఐఆర్ కార్యకలాపాలు తప్పకుండా చేస్తుంటామన్నారు. కల్పనా రమేశ్ తమను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారన్నారు. తమ కు చాలా ఆసక్తికరంగా అనిపించిందని వెల్లడించారు. వారసత్వ సంపద గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఓ పాఠంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్టును ఎం చుకున్నామన్నారు. బావి పునరుద్ధరించడం చా లా గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇ లాంటివి మరిన్ని చేయటానికి ముందుంటామని తెలిపారు.

నీటి వనరుల సంరక్షణకు పాటుపడే రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహె సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సదరు సంస్థల ప్రతినిధి కల్పన రమేష్ అన్నారు. చారిత్రక, సామాజిక హితం ఉన్న చిరెక్ స్కూల్ యాజమాన్యం ఈ ప్రాజెక్టులో భాగస్వాముల య్యారన్నారు. బావి పునరుద్ధరణకు 27 లక్షలు అందించారని చెప్పారు. చెన్నై, అహ్మదాబాద్ నుంచి నిపుణులను పిలిపించి పనులు చేపట్టామని తెలిపారు. బావి నేపథ్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత చెత్త వేయకుండా, ఎవరూ ప్రమాదవశాత్తు పడకుండా మెష్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు స్ఫూర్తితో భవిష్యత్తులో మరికొన్నింటిని సంరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. వారసత్వం సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి తోడ్పాటునందిస్తే వాటి అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని తెలిపారు.

వారసత్వ కట్టడాల సంరక్షణ అందరి బాధ్యత : అరవింద్ కుమార్
వారసత్వ కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. వారసత్వ సంపదను కాపాడుకోవటం గురించి పిల్లలకు ఈ కార్యక్రమం ద్వారా బలంగా తెలుస్తుందన్నారు. ఇలాంటి వాటిలో పాల్గొనడం, కట్టడాల పునరుద్ధరించడం గర్వంగా భావిస్తుంటారని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలు బావుల పునరుద్ధరణకు సంకల్పిస్తాయని అనుకుంటున్నానన్నారు. ఒక కట్టడాన్ని మళ్లీ అదే రీతిలో నిర్మించడం మంచి అనుభూతిని కలిగిస్తాయని వెల్లడించారు.

 

KTR appreciates step well restoration at gachibowli