Home బిజినెస్ తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్క్

తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్క్

KTR at IPL International Conference

ఐప్లెక్స్ అంతర్జాతీయ సదస్సులో కెటిఆర్

మన తెలంగాణ /హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరా ల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. గడచిన రెండేళ్లలో తెలంగాణ ప్లాస్టిక్ పరిశ్రమ రూ. 1000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యు ఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్‌మా)తో కలిసి తెలంగాణ ప్రభుత్వం తుమ్మ లూరులో ప్లాస్టిక్ పార్కును అభివృద్ధి చేయనుందన్నారు. 110 ఎకరాల్లో రూ.500 కోట్ల పెట్టుబడులతో అభివృద్ది చేయనున్న ఈ ప్లాస్టిక్ పార్కు ద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నామన్నారు. మాధాపూర్ హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్‌పోసిషన్ (IPLEX18)ను శుక్రవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐప్లెక్స్18 అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ అనిల్ రెడ్డి వెన్నం, కన్వీనర్ వేణుగోపాల్ జాస్తి, ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హెటెల్ బుఢే, సిపెట్ డైరెక్టర్ జనరల్ ఎస్‌కె. నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.