Friday, April 19, 2024

శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Review Meeting With Municipal Commissioner

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. జూన్‌లో రుతుపవనాలు వస్తాయని, వర్షపాతం వల్ల పనులు కష్టమవుతాయని ఆ లోపు రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో పెండింగ్‌లో ఉన్న రోబ్(రైల్వే ఓవర్ బ్రిడ్జెస్)లు, రూబ్(రైల్వే అండర్ బ్రిడ్జెస్)ల నిర్మాణ పనులు, ఇతరత్రా పెండింగ్ పనులను సైతం సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించాయి. పట్టణ పేదల కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో 123 బస్తీ దవాఖానాస్, 45 నూతన ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు సిద్ధమయ్యాయి.

రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మించిన అండర్ పాస్, పై వంతెనను గురువారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కామినేని వద్ద 940 మీటర్ల పై వంతెన, ఎల్బీనగర్ కూడలి వద్ద 519 మీటర్ల అండర్ పాస్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. వీటిని గురువారం నాడు జాతికి అంకితం చేస్తామని ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నగరాభివృద్ధిలో తలమానికంగా నిలిచిన రోడ్ల అభివృద్ది, ఫ్లైఓవర్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టపర్చారు. దుర్గం చెరువపై ఊగే వంతెన నిర్మాణం పనులు కూడా పూర్తికావచ్చాయన్నారు.

KTR Begin LB Nagar Flyover on May 28th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News