Thursday, April 25, 2024

ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్
ఆర్ అండ్ డి ప్రపంచస్థాయికి దీటుగా భాగ్యనగరం
సాయి లైఫ్ సైన్సెస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

kTR begins search and technology in Genome Valley

మన తెలంగాణ/హైదరాబాద్: ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ అవతరిస్తున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గత ఆరేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు రావడం ప్రారంభమ య్యాని తెలిపారు. ఇందుకు పరిశ్రమల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతనేనని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి పరిశోధన, సాంకేతిక కేంద్రాన్ని సాయి లైఫ్ సైన్సెస్ భాగ్యనగరంలో ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో సాయి లైఫ్ సెన్సెన్ కొత్తగా ఏర్పాటు చేసిన రిసెర్చ్, టెక్నాలిజీ సెంటర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు సాయి లైఫ్ సెన్సెస్ 1000మందికి పైగా గ్లోబల్ ఇన్నోవేటర్లకు సేవలు అందించడానికి ముందుకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఆర్ అండ్ డి(రిసెర్చ్…డెవలప్‌మెంట్), అసాధారణ టాలెంట్ పూల్‌కు సాయి లైఫ్ సైన్సెస్ విస్తరణ ఒక నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. ఔషధాల అభివృద్ధి, తయారికి సాయి లైఫ్ సెన్సెస్ చేస్తున్న కృషిని కూడా ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభినందించారు.
అనంతరం సాయి లైఫ్ సెన్సెస్ సిఇఒ, ఎండి కృష్ణ కనుమురి మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆర్ అండ్ డి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, లోతైన డొమైన్ నైపుణ్యం తో ప్రతిభను పెంపొందించడానికే హైదరాబాద్ నగరంలో తమ కేంద్రాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. ఫార్మా డ్రీమ్స్ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలోని ఇతర ఆర్‌అండ్‌డి ల్యాబ్‌ల కంటే తమది అనేక ప్రత్యేకతలతో కూడుకున్నదన్నారు. తమ సంస్థ టాప్10 గ్లోబల్ ఇన్నోవేటర్ ఫార్మా కంపెనీలు, మరో 7 చిన్న మధ్య పరిమాణ ఆవిష్కర్తలతో కలిసి పనిచేస్తుందన్నారు.2025 నాటికి 25 కొత్త ఔషధాలను తీసుకురావడానికి గ్లోబల్ ఇన్నోవేటర్ భాగస్వాములకు మద్దతు ఇవ్వడంపై తమ సంస్థ ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.

kTR begins search and technology in Genome Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News