Tuesday, April 16, 2024

కెసిఆర్ మార్గదర్శకత్వంలో కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ 1996లో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో సమగ్ర తాగు నీటి పథకం ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగు నీరు అందించిన మానవాతవాది. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథకు ముహూర్తం చేసి, ఇప్పుడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. పేద, ధనిక భేదం లేకుండా అన్ని గృహాలకు సంతృప్తికరమైన రీతిలో నీరు ఇవ్వాలన్న దూరదృష్టితో, ఈ సమగ్రమైన ప్రాజెక్ట్ స్థాపించి అందరి మన్ననలు పొందిన మహానాయకుడు, దార్శనికుడు కెసిఆర్.

KTR Birth day wishes by Telangana people

నా బంగారు తెలంగాణలోని ప్రజలందరికీ గుక్కెడు త్రాగునీరు ప్రతి ఇంటికీ అందించాలన్న కెసిఆర్ సంకల్పమే మిషన్ భగీరథ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్టులలో సాగు నీరు ప్రాజెక్టు కాళేశ్వరం ఒకటి. అయితే బృహత్తరమైన త్రాగునీరు ప్రాజెక్టు మిషన భగీరథ. ఈ పథకాన్ని 7, ఆగస్టు 2016లో గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైలాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సురక్షితమైన, స్థిరమైన శుద్ధి చేసిన తాగు నీటిని అందించే నిబద్ధతతో ఒఆర్‌ఆర్ వెలుపల ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో 23,968 గ్రామీణ ఆవాసాలు, 120 పట్టణ కేంద్రాలకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలనే ఏకైక లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తూ నా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తినడానికి తిండి, త్రాగడానికి నీరు, ఉండడానికి నీడ లేకుండా, అసంతృప్తితో వుండకూడదు అన్న ఒకే ఒక ఆలోచనతో ప్రారంభించిన ప్రాజెక్టు. ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే దూరదృష్టితో, ఆర్థిక భారం అయినప్పటికీ 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ సంతోషంగా వుండాలనే చిత్తశుద్ధితో తలపెట్టిన కార్యక్రమానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురైన సంఘటనలు, విమర్శలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్షాలు అడ్డూఅదుపూ లేకుండా అవమానాలు చేసినప్పటికీ, నిలాపనిందలు వేసినప్పటికీ, పల్లెపల్లేకు స్వచ్ఛమైన నీరు అందించాలనే కోరిక ముందు నిలువ లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని గట్టిగా సమాధానం చెప్పాలి అంటే ప్రాజెక్టు పూర్తి చేయడమే మన ముందన్న కర్తవ్యం అని ముందకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయం ముందు అవన్నీ బలాదూరేనని మరోసారి రుజువు అయ్యింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ 1996లో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో సమగ్ర తాగు నీటి పథకం ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగు నీరు అందించిన మానవాతవాది. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథకు ముహూర్తం చేసి, ఇప్పుడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. పేద, ధనిక భేదం లేకుండా అన్ని గృహాలకు సంతృప్తికరమైన రీతిలో నీరు ఇవ్వాలన్న దూరదృష్టితో, ఈ సమగ్రమైన ప్రాజెక్ట్ స్థాపించి అందరి మన్ననలు పొందిన మహానాయకుడు, దార్శనికుడు కెసిఆర్. ఎందుకంటే దేశ వ్యాప్తంగా మంచి నీటి పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనను రేకిత్తించిన మిషన్ భగీరథకు వచ్చే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ ప్రజలకు మంచి నీరు, త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

కెటిఆర్ వ్యూహంలోనూ, కార్యచరణలోనూ 100% అమలు చేసి సఫలీకృతం చేసి, మిషన్ భగీరథ పథకంను విజయం సాధించి, రక్షిత మంచి నీరు అందించడం గగనమే అన్న వాండ్లకు చేతలతో నోరు మూయించినారు. కెటిఆర్ మొదటి నుండి కూడా విజన్, సంకల్ప బలం, మనుష ధర్మాల పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న నాయకుడు, క్షేత్ర స్థాయిలో భగీరథుడిలా లక్షల కిలోమీటర్ల పైపు లైన్‌తో 26 సెగ్మెంట్లు, దాదాపు 99 నియోజక వర్గాలలో, 437 మండలాలు ఆవాస ప్రాంతాలు, నగర పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లతో కల్పి 24,224, మొత్తం గృహలు 65,29,770లకు గ్రామీణ ప్రాంతాల్లో 52,47,225 గృహాల్లో త్రాగు నీరు అందించడం లక్ష్యంగా పట్టణ ప్రాంత గృహాలు 12,82,545, ఈ పథకం క్రింద లబ్ధిదారులు 2.72 కోట్లు. అయితే పథకం అంచనా వ్యయం మాత్రం 45.028 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక ఇంటికి 100 ఎల్‌పిసిడి, మున్సిపాల్టీ, నగర పంచాయతీలలో 135 ఎల్‌పిసిడి, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 ఎల్‌పిసిడి కేటాయింపులు చేయడం, అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు మొత్తం నీటిలో 10% కేటాయించ బడింది. ఈ పథకం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించింది, ఆర్థికవృద్ధికి తోడ్పడింది. అందరికి త్రాగునీరు అందించాలనే కెసిఆర్ అలోచనను చిత్తశుద్ధితో అమలు చేసిన కార్యనిర్వాహకుడు. ఈ పథకం తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించారు. ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆర్ధిక స్థితిగతులను పెంపొందించడానికి వ్యాధుల బారి నుండి విముక్తి చెందడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కెటిఆర్ ఆలోచన ప్రతిరూపం భగీరథ కారణం వుంది.

మొదటి నుండి కూడా మిషన్ భగీరథ సక్సెస్ కోసం తన ఆలోచనను అంతా కూడా ప్రాజెక్టు పై అధ్యయనం చేసి తనకంటూ ఒక విజన్ వుందని నిరూపించుకున్నారు. లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌కు పూర్తి చేయుటకు ఎన్నో సర్వీసు క్రాసింగుల అధిగమించాల్సి వచ్చింది. అసలే ఐ.టి, సాంకేతిక రంగం లో దిట్ట అయిన కెటిఆర్ తనదైన శైలీలో ఇంటింటికీ త్రాగునీరు అందించాలనే ఒక కసి, పట్టుదల ఆయన విజయానికి నాంది పలికింది. ప్లో కంట్రోల్ వాల్వ్ తెలంగాణలో తొలిసారిగా మిషన్ భగీరథకు వాడిన సాంకేతికతను చూసి ఆశ్చర్యం కల్గుతుంది. పైపులైన్ ద్వారా నిమిషానికి 5 లీటర్ల నీళ్ళు మాత్రమే వెళుతాయి. ఒకవేళ మోటారుతో తోడుకోవాలని ప్రయత్నించినా అదనంగా ఒక బొట్టు కూడా రాకుండా నియంత్రిస్తుంది. అదే మన పురపాలక శాఖ, ఐ.టి శాఖ మాత్యుల సాంకేతిక రంగంలో వున్న అనుభవం గురించి, మిషన్ భగీరథ సక్సెస్‌తో పట్టుదలకు అద్దపట్టింది. పూర్తి చేయుటకు ఎన్నో సర్వీసు క్రాసింగుల అధిగమించాల్సి వచ్చింది.

మిషన్ భగీరథ కోసం నీటి కేటాయింపుల విషయంలో కూడా ముందు చూపుతో వ్యవహరించడం కెసిఆర్ పాలన దక్షతకు నిదర్శనం. కృష్ణ, గోదావరి నదులలో 86.11 టిఎంసిల నీటి కేటాయింపులు చేసినారు. నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్ధాయిని కూడా ఖరారు చేయడం విశేషం. కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్ల నుండి 23.44 టిఎంసిలు, గోదావరి బేసిన్‌లో 21 రిజర్వాయర్ల నుండి 32.58 టిఎంసిలు కేటాయించారు. నిస్వార్థంతో వందల సంవత్సరాలకు పూలబాట వేసిన మహనీయుడు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న నల్లాలద్వారా శుద్ధి చేసిన త్రాగునీరుకు ప్లో కంట్రోల్ వాల్వ్‌ను వాడాలని తెలంగాణలో అమలు చేస్తున్న, విజయవంతం అయిన మిషన్ భగీరథ పథకం మోడల్‌గా తీసుకొని అధ్యయనం చేయాడానికి, వాడిన సాంకేతికతను పరిశీలించడానికి జాతీయ జల్ జీవన్ మిషన్ (జల్ శక్తి మంత్రిత్వ శాఖ) డైరెక్టర్ మనోజ్‌కుమార్ సాహో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం తెలంగాణకే గర్వకారణం. జన హృదయాలలో ఆత్మీయుడుగా సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అనిర్వచనీయ స్నేహశీలి కల్వకుంట్ల తారక రామారావుకు జన్మదిన శుభాకాంక్షలతో…

సంగని మల్లేశ్వర్
9866255355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News