Thursday, April 25, 2024

ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు

- Advertisement -
- Advertisement -

KTR

 

కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం

ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు

సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు మొండిచేయి చూపించారు

హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్‌పైనా స్పందించలేదు

నీతిఆయోగ్ చెప్పినా వినలేదు

డైలాగులు చెపుతూ ప్రజలను మోసగించడం కాదు, బిజెపి వారు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిధులు సాధించుకురావాలి

ప్రాజెక్టులకు సాయం చేయించడం చేతకాని లచ్చన్న మాటలకు
విలువలేదు n కాంగ్రెస్, బిజెపిలు ఏక్, దో, తీన్, చార్ పార్టీలే
n అడ్డీమార్ గుడ్డి దెబ్బగా 4 ఎంపి స్థానాలు గెలుచుకున్న బిజెపి మిడిసి
పడుతోంది n పురఎన్నికల్లో ఆ రెండింటినీ చిత్తుగా ఓడించారు

హైదరాబాద్ : అభివృద్ధిని విస్మరించి కాంగ్రెస్ బిజెపి డైలాగులకే పరిమితమయ్యాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దుయ్యబట్టారు. డైలాగులు చెపుతూ ప్రజలను మోసం చే యడంకాదు దమ్ముంటే కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు తేవాలని కాంగ్రెస్, బిజెపిని ఆయన డిమా ండ్ చేశారు. రాజ్యాంగబద్దంగా రావల్సిన నిధుల కంటే కేంద్రం నుంచి అరపైసాకూడా సాధించలేని బిజెపి లచ్చన్నకూడా మాట్లాడుతున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా ఈ రెండు పార్టీ లు ఏక్‌దో తీన్ చార్ అంటూ పాటలు పాడుకోవడమే అనవాయితీ అయిందని విమర్శించారు. ఏ దో అడ్డీమార్ గుడ్డి దెబ్బగా నాలుగు ఎంపి స్థానా లు గెలుచుకున్న బిజెపి మిడిసి పడుతోందని ఆయ న వ్యాఖ్యానించారు.

ఆతర్వాత జరిగిన జెడ్‌పి, హూజూర్‌నగర్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపిని, కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని వారు గమనించడంలేదన్నారు. ఆదివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో యువనాయకు డు గణేష్‌గుప్త నాయకత్వంలో శంషాబాద్ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఫార్డ్‌బ్లాక్ సింహం గుర్తు కార్పొరేటర్లు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీకండువాలు కప్పుకున్నా రు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ బిజెపి మాట్లాడితే పాకిస్తాన్,హిందూ ముస్లీం లంటూ చి చ్చుపెడుతూ ఆ మంటల్లో చలికాచుకోవాలని ప్ర యత్నిస్తోందని ఆరోపించారు. జాతీయస్థాయిలో ఉనికి కోల్పొయిన కాంగ్రెస్ రాష్ట్రంలో బిజెపితో కలిసి కెసిఆర్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నించి కేవలం మూడు మున్సిపాలిటీలకు పరిమితమైందన్నారు. ఎన్నికలు ఏవైనా ఈ రెండు పార్టీలు ఏక్ దో తీన్ చార్ అంటూ పాటలు పాడుకొంటున్నాయని ఎద్దేవాచేశారు.

ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో 3,148 డివిజన్లలో పోటీ జరిగితే టిఆర్‌ఎస్ భారీగా గెలుచుకోగా రెండవస్థానంలో ఇండి పెండెంట్లు, టిఆర్‌ఎస్ రెబల్స్ ఉన్నారని చెప్పారు. డైలాగులు కొట్టమంటే ఉత్తమ్‌కుమార్, డాక్టర్ లచ్చన్న మేములేస్తే ్త మనుషులము కాదు, కదిలామంటే సిఎం కెసిఆర్ పని అయిపోతుంది , ఎల్లుండి నుంచి మాదే రాజ్యం అంటూ డైలాగులు అదరగొడతారని విమర్శించారు. గమ్మత్తు ఏమిటంచే 3,148 డివిజన్లలోని 12 వందల స్థానాల్లో వాళ్లు బి ఫారాలు ఇస్తామంటే తీసుకొనే వారు లేరు. కాంగ్రెస్,బిజెపిలను ప్రజలు నమ్మడంలేదని పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్,బిజెపి నుంచి గెలిచిన ఒకరిద్దరూ టిఆర్‌ఎస్‌లోకి వస్తామంటే తీసుకోలేదని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్,బిజెపితో టిఆర్‌ఎస్ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

దౌర్భాగ్యస్థితిలో కాంగ్రెస్, బిజెపి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్మంతరావు మాట్లాడుతూ చెప్పిన వాటిని కెటిఆర్ గుర్తు చేశారు. ఏమి బతకు కాంగ్రెస్‌ది కేవలం మూడు మున్సిపాలిటీలకోసం బిజెపితో పొత్తుపెట్టుకోవల్సి వచ్చిందని హన్మంతరావు విచారం వ్యక్తం చేసిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. ఒక్క కెసిఆర్‌ను టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక రెండు జాతీయపార్టీలు అని చెప్పుకునే కలిసి కండువాలూ కప్పుకున్న దౌర్భాగ్యస్థితిలో ఈ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పేదప్రజల కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలతో కెసిఆర్ పేదల గుండెల్లో నిలిచారన్నారు. టిఆర్‌ఎస్ ఎక్కడ ప్రజలను మభ్యపెట్టలేదు, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. చేసింది చెప్పాము చేయాల్సింది చెప్పడంతో ప్రజలు అర్థం చేసుకుని టిఆర్‌ఎస్ ను గెలిపించారని చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఎక్కడ సామాజిక న్యాయం అనే అంశాన్ని తీసుకురాలేదు.

గెలిచిన అనంతరం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని సామాజిక న్యాయం చేసి చూపించామని కెటిఆర్ చెప్పారు. బిసిలకు పెద్దపీటవేశాము, 244 మంది మహిళలను ఛైర్మన్లుగా,వైస్ ఛైర్మన్లుగా ఎంపిక చేసి 57 శాతం రిజర్వేషన్లను మహిళలకు ఇచ్చిన ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని కెటిఆర్ ప్రకటించారు. ఆర్యవైశ్యులకు చరిత్రలో ఏ నాడు లేని విధంగా 11 మంది ఛైర్మన్లు, 4గురు వైస్ ఛైర్మన్లుగా అవకాశం లభించడంతో పాటు సామాజిక సమతూకాన్ని పాటించామని కెటిఆర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్నికలిపి ఎద్దుల జోడు ఎద్దుల బండిలా మననాయకుడు కెసిఆర్ ముందుకు తీసుకువెళ్లుతున్నారని కెటిఆర్ చెప్పారు. ఎన్నికలు ఏవైనా టిఆర్‌ఎస్ జెండా ఎగురుతుండటంతో కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందని నిందించారు. ఇవిఎంలు అయినా, బ్యాలెట్ అయినా ఉత్తమ్‌కుమార్ రెడ్డి నమ్మడంలేదన్నారు. ఉత్తమ్‌కు రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలు, ఎన్నికలు, కోర్టుల మీద నమ్మకంలేదని ఆరోపించారు.

అయితే వాస్తవంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని కెటిఆర్ చెప్పారు. ఉత్తమ్‌కు వ్యవస్థల మీద నమ్మకం పోవడంకాదు దేశంలోని కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం పోయిందని ఉత్తమ్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. రాష్ట్రంలో బిజెపి ప్రజల మనసు గెలవాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి ఏమైనా ప్రత్యేకంగా తీసుకురమ్మని సలహా ఇచ్చాము, కాళేశ్వరం ప్రాజెక్టు, రంగారెడ్డి పాలమూరు చేవెళ్ల ప్రాజెక్టుకు నిధులు తీసుకురమ్మంటే చేతకాని లచ్చన్న మాట్లాడే మాటలకి విలువలేదని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులకంటే, చట్టబద్ధంగా రావల్సినవాటికంటే ఒక అరపైసా అయినా ఎక్కువతీసుకువచ్చావా లచ్చన్నాఅని కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరు బడ్జెట్లలో మోడీ ప్రభుత్వం ఒక్కపైసా కూడా అదనంగా ఇవ్వలేదు. ఫార్మాసిటీ అభివృద్ధికి రూ.3వేల కోట్లు అడిగితే మూడు పైసలు కూడా కేంద్రం ఇవ్వలేదు.

సికింద్రబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సహకారం కోరితే మొండి చేయి చూపించారు. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్,హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరువరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సహాయం కోరితే కేంద్రం స్పందించలేదు. నీతి ఆయోగ్ చెప్పనా కేంద్రం వినలేదు అని కెటిఆర్ కేంద్రంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, జీవన్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందన గణ్‌ష్‌గుప్తా తో పాటు వందలాధి మంది టిడిపి కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఫార్వర్డ్ బ్లాక్ చందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే వందలాధి మంది ఆర్యవైశ్యులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

KTR comments on central Government
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News