Saturday, April 20, 2024

లండన్‌లో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా సోల్జర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొన్ని నెలల్లోనే జరగనున్న ఎలక్షన్స్‌లో – మరొకసారి అద్భుత విజయం సాధించి, సిఎంగా కెసిఆర్ హాట్రిక్ సాధిస్తారంటూ ఫేస్‌బుక్, ఇతరత్రా సోషల్ మీడియా మాధ్యమాల్లో పాజిటివ్ పోస్టులతో బిఆర్‌ఎస్‌ను మరింతగా తెలంగాణ ప్రజల దరి చేర్చే విధంగా కృషి చేస్తున్న భువనగిరి నవీన్‌కు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హార్థిక అభినందనలు తెలిపారు. తను నమ్మిన ఆశయం కోసం, తన రాష్ట్రం తెలంగాణ కోసం నిరంతరం తపిస్తున్న నవీన్ తన మిత్రుడు కావడం వ్యక్తిగతంగా తనకు గర్వకారణ మన్నారు. ‘లండన్‌లో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా సోల్జర్ భువనగిరి నవీన్‌కుమార్ ప్రస్తుతం బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ లండన్ ఇంఛార్జిగా కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు.

ఖమ్మం నుంచి లండన్‌కు వెళ్లి అక్కడ బివిఆర్ టెక్ పేరుతో సొంతంగా కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్సల్టెన్సీ కూడా చేస్తున్నాడు. బిఆర్‌ఎస్ పార్టీకున్న వేల మంది వాలంటీర్ సోషల్ మీడియా వారియర్స్‌లో ఒకరు. తెలంగాణ మొత్తం జనాభా సుమారుగా ఒక 4 కోట్లు అనుకుంటే – అందులో కనీసం ఒక 20 శాతం మందికి ఆన్‌లైన్‌లో నిరంతరం టచ్‌లో ఉంటాడు నవీన్. నవీన్ సగటున రోజుకు సుమారు 300+ పోస్టులు ఒక్క ఫేస్‌బుక్‌లోనే పెడుతారు. ఈ పోస్టులన్నీ వందకి వంద శాతం -కేవలం తెలంగాణ గురించే ఉంటాయి. అది కూడా కెసిఆర్ సాధిస్తున్న అద్భుత విజయాలపైనా, కెసిఆర్ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి, కింది స్థాయి వరకు వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు చేస్తున్న పనుల గురించే వుంటాయ’ని అన్నారు.

అదే విధంగా పట్టణాభివృద్ధి, ఇండస్ట్రీస్, ఐటి శాఖల మంత్రిగా కెటిఆర్ సాధించి చూపిస్తున్న విజయాలపై, బిఆర్‌ఎస్ పార్టీపై, ఆ పార్టీ సృష్టిస్తున్న సంచలనాలు, సృష్టించబోయే ప్రకంపనాల మీదే ఉంటాయి. హాన్స్‌లో, లండన్‌లో ఉంటున్న నవీన్ ఉదయం 7 గంటలకు లేచి అర్ధరాత్రి దాటి 1 గంట వరకు పనేచేస్తాడు. 8 గంటలు ఉద్యోగానికి కేటాయించినా, మిగిలిన 10 గంటలు బిఆర్‌ఎస్ పార్టీకే పనిచేస్తుంటాడాయన. ‘గత 28 రోజుల్లో నవీన్ పోస్టుల రీచ్: 10.6 మిలియన్స్, అంటే – కోటి అరవై లక్షల మందికి నవీన్ పోస్టులు రీచ్ అయ్యాయి.

నవీన్ పోస్టులతో ఎంగేజ్ అయినవారి సంఖ్య: 958.2కె. అంటే – సుమారు 10 లక్షల మంది నవీన్ పోస్టులను చదవటం, లైకులు కొట్టడం, కామెంట్ చెయ్యటం, షేర్ చెయ్యటం చేశారు. నిస్వార్థంగా, ఒక రోబోలా నవీన్ ఇంత కృషి చేయడం అన్నది అంత సులభమైన విషయం కాదు. అందరూ చేయగలిగేది కూడా కాద’ని అన్నారు. కొన్నేళ్ళ క్రితం తామిద్దరం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యింది కూడా ఈ విషయం నేపథ్యంగానేనని మంత్రి కెటిఆర్ వెల్లడిస్తూ.. నిజంగా లండన్‌లో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా సోల్జర్ నవీన్‌యేనని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News