Home తాజా వార్తలు సివిల్స్ విజేతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు

సివిల్స్ విజేతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు

Ktr congratulations to youngsters who cracked upsc

 

మనతెలంగాణ/హైదరాబాద్: సివిల్స్ 2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కెటిఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 9 మంది ఉన్నారు. వరంగల్‌కు చెందిన శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘస్వరూప్ 31 (కర్నూల్), రాళ్లపల్లి జగత్‌సాయి 32 (పశ్చిమ గోదావరి), ఎన్ సాయిమానస 48 (మదనపల్లె, ఎపి), అనీషా శ్రీవాత్సవ 66(హైదరాబాద్), దేవగుడి మౌనిక 75 (హైదరాబాద్), కావలి మేఘన 83 (తాండూర్, వికారాబాద్), రవికుమార్ 84, యశ్వంత్‌కుమార్‌రెడ్డి 93 (కర్నూల్) ర్యాంకు సాధించారు.

 

Ktr congratulations to youngsters who cracked upsc