Friday, March 29, 2024

కేంద్రాన్ని మరో మారు డిమాండ్ చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు భారతదేశానికే ధాన్యాగారంగా మారుతోం దన్నారు. ఇలాం టి తరుణంలో తాము గతంలోనే జాతీయ ప్రాజెక్టు హోదాను అందించడం ద్వారా తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు మద్దతునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం, డిమాండ్ చేస్తూ వస్తున్నామన్నారు. మరోమారు ఇదే డిమాండ్‌ను మంత్రి కెటిఆర్ నేడు ట్విట్టర్ ద్వారా పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన దక్షిణ ప్రాంతీయ సమాఖ్య స్టాడింగ్ కమిటీ 13వ సమావేశం చెన్నైలో జరిగింది.

దక్షిణాది రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ తరపున చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో సహా సంబంధిత అధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెండింగ్ విభజన సమస్యలు, కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, లైంగిక వేధింపులపై సత్వర విచారణ తదితరాంశాలను సదరు సమావేశంలో తెలంగాణ ప్రస్తావించింది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్య లక్ష్మి, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టంపై ప్రస్తావించగా, వీటిలో రైతు బందు, రైతు బీమాను దక్షిణ ప్రాంతీయ సమాఖ్య స్టాండింగ్ కమిటీ 31వ సమావేశంలో ప్రజంటేషన్‌కు సమావేశం తీర్మానించింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్స్ విషయంపైనా తెలంగాణ సమావేశం దృష్టికి తీసుకొచ్చింది.

విభజన సమయంలో ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.6015కోట్ల విషయంపైనా సదరు సమావేశంలో చర్చించింది. గ్రామాల్లో బ్యాంకు శాఖలు, తపాలా, బ్యాంకు సేవలపైనా చర్చించింది. ప్రాజెక్టుల విషయంలో ఎపి విభజన చట్టం ఉల్లంఘనలను సైతం ఈ సమావేశం దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లారు. ఇక లైంగిక వేధింపులపై సత్వర విచారణను తెలంగాణలో కొనసాగిస్తున్నామని సమావేశం దృష్టికి తెచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News