Home తాజా వార్తలు కెటిఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

కెటిఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

KTRహైదరాబాద్‌ :  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటిఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది.  బుధవారం నుంచి కెటిఆర్  తన ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. ఏప్రిల్‌ 9వరకు కెటిఆర్  నిర్వహించే ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను టిఆర్ఎస్ విడుదల చేసింది. తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించే రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అన్ని లోక్‌సభ స్థానాల పరిధిలో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నల్గొండ, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ తదితర స్థానాల్లో కెటిఆర్‌ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇప్పటికే ఆయన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 16 ఎంపి స్థానాలు సాధించే దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు. 16 స్థానాలు సాధించి తీరుతామన్న గట్టి ధీమాలో ఆయన ఉన్నారు.

KTR Election Campaign Schedule Released