Thursday, April 25, 2024

రేవంత్ రెడ్డిపై హైకోర్టులో కెటిఆర్ పరువునష్టం దావా

- Advertisement -
- Advertisement -

KTR filed a suit for defamation before High Court

హైదరాబాద్: కాంగ్రెస్ పిసిసి ఛీఫ్, ఎంపి రేవంత్ రెడ్డిపై హైకోర్టులో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పరువునష్టం దావా వేశారు. రేవంత్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కెటిఆర్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దోషులకు శిక్ష తప్పదని కెటిఆర్ ట్వీట్ చేశారు. అంతకుముందు, రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ పై కెటిఆర్ స్పందించారు. తాను డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమని, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపి రాహుల్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పరీక్షలకు సిద్ధమైతే, తాను ఢిల్లీ ఎయిమ్స్ వచ్చి పరీక్షలు చేయించుకుంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చిన వారితో పరీక్షలు చేయించుకునే స్థితిలో తాను లేనని ఆయన పేర్కొన్నారు.

తాను పరీక్షలు చేయించుకుని క్లీన్ చీట్ తో వస్తే రేవంత్ తనకు క్షమాపణలు చెప్పి, పదవులను వదులుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సత్య శోధన పరీక్షలకు సిద్ధమా అని కెటిఆర్ ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వంపై, సిఎం కెసిఆర్ పై, తనపై తప్పుడు ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డి వంటి చిల్లరగాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కెటిఆర్ అన్నారు. కెటిఆర్ చేసిన ట్వీట్ పై అటు రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. ”లైట్ డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం. మాతోపాటు కెసిఆర్ కూడా సహారా, ఈఎస్ఐ స్కాంలలో లై డిటెక్టర్ టెస్టులకు రావాలి” అని సవాల్ విసిరాడు.

KTR filed a suit for defamation before High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News