Wednesday, April 24, 2024

KTR:అమిత్‌షాపై కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమిత్ షాపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం చెందారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిఎం కెసిఆర్‌కు మనసు రావడం లేదని సెప్టెంబర్ 17పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రివి స్థాయికి తగిన వ్యాఖ్యలు కావని సెటైర్ వేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో 1948లో విలీనమైన నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోందన్నారు. ఈ విషయాన్ని విస్మరించి తప్పుడు ప్రకటనలు చేయడం కేంద్ర మంత్రిగా తగదని సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షా అబాండాలు వేయడం సరికాదన్నారు.

ఈ రోజును విమోచనదినోత్సవంగా ఎందుకు జరపడం లేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు ఆగస్టు 15ను స్వాతంత్య్ర దినోత్సవానికి బదులు విమోచన దినోత్సవంగా ఎందుకు జరుపుకోవడం లేదని ప్రశ్నించారు. అణచివేత దాడులకు వ్యతిరేకంగా జరిగిన త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యం అని, అది బ్రిటీష్ లేదా నిజాం అయినా అని పేర్కొన్నారు. గతకాలపు ఖైదీలుగా ఉండటం మాని భవిష్యత్ నిర్మాణాకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. అమిత్ షా తప్పుడు ప్రకటన మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News