Home చిన్న సినిమాలు సినిమాల రాంచరణ్ తెలుసా? (వీడియో వైరల్)

సినిమాల రాంచరణ్ తెలుసా? (వీడియో వైరల్)

ktr

సరదాగా బాలుడితో మాట్లాడిన కెటిఆర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్: అధికారిక కార్యక్రమాల్లో ఎంతో హుందాగా ఉండే రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రజలతో మాట్లాడేటప్పుడు వారితో కలిసిపోయి మాట్లాడుతుంటారు. గురువారం ఖైరతాబాద్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు సరదాగా ఇలాంటి సంఘటనే జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు కెటిఆర్ పర్యటించారు. ఒక ఇంటి ముందు ఆగి ఓ విద్యార్థితో సరదాగా కెటిఆర్ మాట్లాడటం సామాజిక మీడియాలో వైరల్ అవుతుంది.

ఓ ఇంటి ముందు ఆగి అక్కడున్న బాలుడి గురించి అడుగుతూ ఇంటి పెద్దాయనను ఆ బాబు నీ కొడుకా అని కెటిఆర్ ప్రశ్నించారు. అవును అంటూ బాలుడి తండ్రి చెపుతూ కొడుకుపేరు రాంచరణ్ అని చెప్పారు. వెంటనే ఆ బాలుడితో కెటిఆర్ సినిమాల రామ్‌చరణ్ తెలుసా అంటూ సరదాగా ప్రశ్నించగా ఆ బాలుడు తెలుసు అని చెప్పాడు. లాక్‌డౌన్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నావా అని అడగడంతో అక్కడ ఉన్న వారి నవ్వులతో ఆ ప్రాంతమంతా సరదగా మారింది. అక్కడివారితో కెటిఆర్ కలిసిపోయి అందరూ మంచిగున్నారా, మీకెవరికీ ఏమీకాదు, మూతికి బట్ట కట్టుకోవాలి, బయటకు వెళ్లవదు. మూడు తారీఖు తర్వాత పరిస్థితి చెపుతామని ఆయన అక్కడి వారితో చెప్పారు.

KTR Funny Conversation With Kid About Ram Charan