Home తాజా వార్తలు నిరాశ్రయ కుటుంబానికి కెటిఆర్ చేయూత…

నిరాశ్రయ కుటుంబానికి కెటిఆర్ చేయూత…

KTR

 

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన వేముల సదానందం కుటుంబం దీన గాధకు సిరిసిల్ల ఎంఎల్‌ఏ, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకుంటామని తన పిఏ గనరాజ్ ద్వారా సమాచారం అందించారు.

వివరాల్లోకి వెళితే సిరిసిల్ల శివనగర్‌కు చెందిన పవర్‌లూం ఆసామైన వేముల సదానందం ఆర్ధిక సమస్యలతో వారం రోజుల క్రితం పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో అద్దె ఇంటివారు సదానందం భార్య, ఇద్దరు పిల్లలను తమ ఇంటినుండి వెళ్లగొట్టారు. దాంతో రోడ్డుపై తలదాచుకున్న ఆ కుటుంబం ఆదివారం వర్షం కురియడంతో ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో తలదాచుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంఎల్‌ఏ కెటిఆర్ స్పందించి తన పిఏ గణరాజ్‌ను, స్థానిక నాయకులను ఆసుపత్రికి పంపించి మృతుడు సదానందం భార్య కవితను కలిసి ఆమెకు ధైర్యం చెప్పారు. తాత్కాలిక వసతి కల్పించడంతో పాటుగా అన్నివిధాలుగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు.

KTR Help to Homeless Family