Home తాజా వార్తలు కాంగ్రెస్ ది మొండి చేయి.. బిజెపిది తొండి చేయి

కాంగ్రెస్ ది మొండి చేయి.. బిజెపిది తొండి చేయి

KTR inaugurates development works in warangal

 

ధరలు పెంచడమేనా అచ్చేదిన్?
మోడీ పాలనలో ప్రజలకు సచ్చేదిన్
పెట్రోల్, డీజెల్, గ్యాస్, కూరగాయలు చివరికి ఎరువుల ధరలు కూడా పెరిగాయి
ఇదేమిటని అడిగితే దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు
కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, ఇప్పుడు అడిగితే నోరు మెదపడంలేదు, జన్‌ధన్ ఖాతాలో
15లక్షలు ఏమయ్యాయి?, మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారు,
బిజెపి నాయకులు పచ్చిఅబద్ధాలకోరులు,
వరంగల్‌కు మెట్రో రైల్ బాధ్యత నాది
సోమవారం నాడు వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్: అచ్చేదిన్ అయేంగే.. అచ్చేదిన్ లాయేంగే అన్న దేశ ప్రధాని మోదీ పాలనలో సచ్చేదిన్ వచ్చేలా ప రిస్థితులు దాపురించాయని, ఈ ప్రధాని రాకముందు సిలిండర్ ధర రూ. 440 ఉంటే నేడు వెయ్యి రూపాయాలకు చేరిందని ఇదేనా అచ్చేదిన్ అంటే అని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పట్టుకుని నీ చేతగాని తనం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించిన మోదీ ఓట్లేయడానికి వెళ్లడానికి ముందు సిలిండర్‌కు దం డం పెట్టుకుని వెళ్లమన్నాడని ఇప్పడు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. నేడు పెట్రోల్, డీజిల్, కూరగాయాలు, ఆఖరికి రైతుల ఎరువుల ధరలు కూడా పెరిగిపోయాయని, ఇదేంటి అని అడిగితే దేశం కోసం ధర్మం కోసం అంటూ సమాధానం దాటవేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. క్రికెట్‌లో సెంచరీ చేస్తే హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటా రో నేడు యువత పెట్రోల్ బంక్‌లకు వెళ్లినప్పుడు వంద రూపాయాల బిల్లు చూసి హెల్మెట్ తీసి ముద్దుపెట్టుకుని పైకి చూపించాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు.

సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ. 2579 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భం గా ఖిలా వరంగల్, శాయంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి వాళ్లు ఎగెరిగెరి పడుతున్నారని, నరేంద్రమోదీ ఆనాడు జన్‌ధన్ ఖాతా ఖోలో పంద్రా లాక్ లేలో అన్నాడు. మరీ ఆ రూ. 15 లక్షలు ఎంత మందికి వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెసోళ్లది మొండి చెయ్యి ఆయన ఎద్దేవా చేశారు. క్రికెట్‌లో సెంచరీ చేస్తే హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటా రో నేడు యువత పెట్రోల్ బంక్‌లకు వెళ్లినప్పుడు వంద రూపాయాల బిల్లు చూసి హెల్మెట్ తీసి ముద్దుపెట్టుకుని పైకి చూపించాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు.

సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ. 2579 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భం గా ఖిలా వరంగల్, శాయంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి వాళ్లు ఎగెరిగెరి పడుతున్నారని, నరేంద్రమోదీ ఆనాడు జన్‌ధన్ ఖాతా ఖోలో పంద్రా లాక్ లేలో అన్నాడు. మరీ ఆ రూ. 15 లక్షలు ఎంత మందికి వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెసోళ్లది మొండి చెయ్యి అయితే బీజేపీది తొండి చెయ్యని మంత్రి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని మాట ఇచ్చారు, కానీ ఈ రోజు అడిగితే మెమ్మెమ్మె.. బెబ్బెబ్బే అంటూ నోరు మెదపడం లేదన్నారు. మహారాష్ట్రలో కోచ్‌ఫ్యాక్టరీకి మాట ఇచ్చి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. మనకు 2014లో మాట ఇచ్చి మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు.

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే…!
ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే, సందర్భం ఏదైనా మా నాయకుడు కేసీఆర్ అన్నట్లుగా ఓరుగల్లు ప్రజలు ఆదరిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉంది వచ్చాక ఎలా ఉంది మీరే చూడండి. ఒకప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయాలు పింఛన్ ఇచ్చేవారు. వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. ఈ 500 మంది పింఛన్‌అడిగితే వచ్చే వారిలో ఎవరో ఒకరు చస్తే మీ పేరు రాస్తమనేటోళ్లని విమర్శించారు. కాంగ్రెసోళ్లు వచ్చి 75 రూపాయాలను రూ. 200 లు చేసి భారతదేశంలో ఎవరూ చేయనట్లు వారే చేశామని డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు.

ముసలోళ్లు మందుగోలీలు తెచ్చుకునేందుకు ఆటో ఖర్చులకు సరిపోలేదు వారిచ్చినవి కానీ చారాన కోడికి బారాన ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పింఛన్‌ను రూ. 200 నుంచి పదిరెట్లు పెంచి రూ. 2016 చేశామన్నారు. గతంలో 29 లక్షల మందికి పింఛన్ ఇస్తే తెలంగాణ వచ్చాక మరో 11 లక్షల మందికి కొత్తగా ఇస్తూ మొత్తంగా 40 లక్షల మందికి రూ. 10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో అమ్మమ్మ దగ్గరకు వెళ్లి చాక్లెట్ కొనుక్కుంటా, బిస్కెట్ కొనుక్కుంటా అని అడిగితే పైసలు లేవన్నా రోజు నుంచి నేడు మనవళ్లు దగ్గరకు రాగానే 20 రూపాయాలు చేతిలో పెట్టి బిస్కెట్ పొడ తెచ్చుకో అనే పరిస్థితి వచ్చిందని వివరించారు.

పేదోళ్ల సంక్షేమ ప్రభుత్వం
టీఆర్‌ఎస్ పేదోళ్ల సంక్షేమ ప్రభుత్వమని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేద ఆడపిల్ల గర్భం దాల్చితే పని చేయకుండా ఉండటానికి మగబిడ్డ కోసం రూ. 12 వేలు, ఆడబిడ్డ కోసం రూ. 13 వేలు ఇస్తున్నామన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేడు కేసీఆర్ కిట్లు ఇస్తూ సర్కార్ దవాఖానాలో డెలివరీలు పెంచామన్నారు. ఫలితంగా మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. తెలంగాణలో నేడు పుడితే పైసలు, బడికి పోతే బ్రహ్మాండమైన భోజనం, విద్య అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి మనమడు, మనుమరాలు ఏ బియ్యం తింటున్నారో అవే బియ్యం గురుకులాల్లో పిల్లలకు తిన్నంతగా పెడుతున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో 200పై చిలుకు గురుకులాలు ఉంటే నేడు 1079 గురుకులాలు పెట్టి అన్ని వర్గాల పేదల పిల్లలకు ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 1,25 వేలు ఖర్చు చేస్తూ అన్ని వసతులు కల్పిస్తోందన్నారు.

గురుకులాల్లో 4.5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్య,భోజనం అందుతోందన్నారు. 18 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంకా ఉన్నత విద్య చదవడం కోసం విదేశాలకు వెళ్లడానికి ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తోంది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారాని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కరెంట్ కష్టాలు ఎలా ఉండెనో గుర్తుకు తెచ్చుకోవాలిన కానీ ఈ రోజు కరెంట్ ఎలా ఉంది గుర్తుంచుకోవాలన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త కానీ నేడు కరెంట్ పోతే వార్త అనే పరిస్థితి ఉందన్నారు. వరంగల్ పట్ణణంలో ఆడబిడ్డల దాహార్తికి ఇచ్చిన మాట ప్రకారం రూ. 1589 కోట్లతో ఉగాదికి ఒకరోజు ముందే నీటి సౌకర్యం తెచ్చిన ప్రభుత్వం మాది అన్నారు.

ఫ్యూచర్ సిటీగా వరంగల్
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనా వరంగల్ నగరాన్ని భవిష్యత్‌లో ఫ్యూచర్ సిటీగా చేస్తామని, ఈ నగరానికి మెట్రో రైల్ తెచ్చే బాధ్యత మాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరంగల్‌పై ప్రత్యేక కమిట్‌మెంట్ ఉందన్నారు. ఒక కార్యచరణతో వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. మాది పనిచేసే ప్రభుత్వం, మీ కోసం ఉండే ప్రభుత్వం. పేదవాన్ని కడుపులో పెట్టుకునే చూసుకునే ప్రభుత్వం ఇదన్నారు. గత ఆరేళ్లుగా ఏకపక్షంగా ఎలాంటి తీర్పు ఇస్తున్నారో అదే తీర్పును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వాలని కోరారు. మీ ఆశీర్వాదం, ప్రోత్సాహం ఉంటే మరింత వేగంగా ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. కొంతమందికి కొత్తగా ఇండ్లు, పింఛన్లు , రేషన్ కారులు ఇచ్చేది ఉందని, కరోనా వల్ల 50 వేల కోట్లకు పైగా ఆదాయం కోల్పోయామని అయినప్పటికీ పేదవాడి సంక్షేమం ఆపలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

సిఎం కెసిఆర్ పాలనలో నగరాభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర రూపురేఖలు మార్చి అందమైన నగరంగా మార్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఇంటింటికి ఫిల్టర్ వాటర్ ఇస్తున్న మహానుభావులు సీఎం కేసీఆర్ కొనియాడారు. నల్లా లేకపోతే దరఖాస్తు పెట్టుకుంటే వారం రోజుల్లో ఇస్తారన్నారు. గోదావరి, కృష్ణానది నుంచి పైప్‌లైన్లు వేసి స్వచ్ఛమైన నీరు తెచ్చి ఇంటింటికి ఇస్తున్నారన్నారు. కేసీఆర్ వచ్చాకే వరంగల్ జిల్లా తెలంగాణ బాగుపడుతోందన్నారు. బీజేపీ వాళ్లు కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తానని చెప్పి మొండి చూపారని, గిరిజన యూనివర్శిటీకి 600 ఎకరాలు కేటాయించినా మంజూరు ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వని బీజేపీకి తెలంగాణ అభివృద్ధి చేయని కాంగ్రెస్ ఓటేద్దామా?

గోదావరి నీళ్లు తెచ్చి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చ్తేన్న టీఆర్‌ఎస్‌కు ఓటేద్దామా ? మీరే నిర్ణయించుకోవాలన్నారు. అభివృద్ధి పట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను తుక్కుతుక్కుగా ఓడించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

KTR inaugurates development works in warangal