Friday, April 19, 2024

రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పోకర్ణ ప్లాంట్ ను ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Inaugurates Pokarna Plant in Shadnagar

హైదరాబాద్: షాద్ నగర్ నియోజకవర్గములో నందిగామ మండల పరిధిలోని మేకగూడలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పోకర్ణ ప్లాంట్ ను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు  మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు పాల్గొన్నారు.

క్వాంట్రా క్వార్జ్‌ బ్రాండ్‌ పేరుతో ప్రీమియం క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ కొత్త ప్లాంటు ఏర్పాటు చేసింది .అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మేకగూడలో దాదాపు 1,60,000 చ.మీ విస్తీర్ణంలో 90లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీన్ని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3000మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త కేంద్రం ప్రారంభంతో సంస్థ మొత్తం వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది.

KTR Inaugurates Pokarna Plant in Shadnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News