Home రాష్ట్ర వార్తలు కెటిఆర్ బచ్చా: ఉత్తమ్

కెటిఆర్ బచ్చా: ఉత్తమ్

కెటిఆర్ ఓ బచ్చా..వాళ్ల నాన్న స్పందిస్తే నేను స్పందిస్తా : ఉత్తమ్

uttamజడ్చర్ల రూరల్ : “కెటిఆర్ ఓ బచ్చా..సవాల్‌పై వాళ్ల నాన్న స్పందిస్తే నేను స్పందిస్తాను” అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నా రు. పాలేరు ఉప ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే  ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారా అని కెటిఆర్ విసిరిన సవాల్‌పై విలే కరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు.  సోమవారం  మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేపట్టిన మహాదీక్షలో పాల్గొనడానికి వెళుతూ జడ్చర్లలో ఆయన కొద్ది సమయం ఆగారు. ఆయ నకు  నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు నెలకొన్నాయని,  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని అన్నారు.  నీళ్లు, పశుగ్రాసం లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయ న్నారు. ఉపాధి హామీ  అస్తవ్యస్తంగా తయారైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కరువు నివారణలో పూర్తిగా విఫలమైందన్నారు.  మాజీ ఎమ్మెల్యే మల్లురవి, సుదర్శన్ గౌడ్, నిత్యానందం,  డి.శ్రీను, తదితరులు ఉన్నారు.