Thursday, March 28, 2024

కేంద్రం వద్ద ఏ డేటా ఉండదు

- Advertisement -
- Advertisement -

KTR is angry with central government

ఎన్‌డిఎ అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్

మరణించిన రైతుల సమాచారమే కాదు, ఆరోగ్యసేవల స్టాఫ్, వలస కార్మికుల మరణాల వివరాలు కూడా ఉండవు, కరోనాతో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతల మృతుల వివరాలూ, కొవిడ్‌లో నిరుద్యోగులైన వారి సమాచారమూ ఉండదు, 20లక్షల కోట్ల ప్యాకేజీ సాయం అందుకున్న సంస్థల జాబితా కూడా దాని వద్ద దొరకదు :కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ మంత్రి కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డేటా ఉండదని విమర్శించారు. అసలు ఎన్‌డిఎ ప్రభుత్వం అంటేనే ‘నో డటా అవెలేబుల్ గవర్నమెంట్ అని విరుచుకుపడ్డారు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఇదే తరహాలో తమ దగ్గర సమాధానం లేదని చేతులు దులుపుకునే పని చేసిన ఉదంతాలను ఆయన ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డేటా ఉండదంటూ ఆయన కొన్ని వార్తా క్లిప్పింగ్‌లను తన ట్వీట్‌కు జత చేశారు. మరణించిన రైతులనే కాదు.. ఆరోగ్య సేవలు అందించే స్టాఫ్ మరణాలు, వలస కార్మికుల మరణాలు అంటూ వరుసగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుతగ్వాన్ని అడిగిన ప్రశ్నను,. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంబంధించిన ప్రతులనూ ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకున్నదా? తీసుకుంటే ఏ నిర్ణయాలు తీసుకున్నది? తీసుకోకుంటే ఎందుకు నిర్ణయించడం లేదు? అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు అడిగాయి.

దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా సమాధానం చెప్పింది. రైతు ఆందోళనలో మరణించిన వారి వివరాలు తమ దగ్గర లేవని, కాబట్టి, వారికి పరిహారం అందించే ప్రశ్న ప్రస్తానవకు రావని పేర్కొంది. ఈ సమాధానంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో మరణించిన పేషెంట్ల వివరాలూ లేవని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తా౪జా సమాధానంపై తెలంగాణ మంత్రి కెటిఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్‌డీఏ అంటేనే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్ అని కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం దగ్గర మరణించిన వైద్యారోగ్య సిబ్బంది వివరాలు ఉండవని, కరోనాతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటం మూలాన మరణించిన వారి వివరాలూ ఉండవని పేర్కొన్నారు. అంతేకాదు, వలస కార్మికుల మరణాలు, కరోనా కారణంగా ఊడిన ఉద్యోగాల వివరాలూ తెలియవని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్దిదారుల వివరాలూ ఉండవని తెలిపారు. ఇప్పుడు తాజాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ మరణించిన రైతుల వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News