Home తాజా వార్తలు జెఎల్ఎల్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని ప్రారంభించిన కెటిఆర్

జెఎల్ఎల్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని ప్రారంభించిన కెటిఆర్

 JLL Real Estate Consulting Company

 

హైదరాబాద్ : రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో జెఎల్ఎల్ రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కొత్త కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కు వచ్చే కంపెనీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగుళూరును హైదరాబాద్ అధిగమిస్తోందని, హైదరాబాద్ లో ఐదేళ్ల క్రితం 52 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు, ఈ ఏడాది లక్షా 9 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి హైదరాబాద్ హబ్ గా మారిందని పేర్కొన్నారు.

గూగుల్ అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో బ్రాంచీలు ఏర్పాటు చేశాయని, కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని కెటిఆర్ తెలియజేశారు. గత ఐదేళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందని, హైదరాబాద్ అభివృద్దిలో జెఎల్ఎల్ గ్రూప్ పాత్ర గొప్పదని కొనియాడారు. మెట్రో రైలు ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, పబ్లిక్ ట్రాన్సపోర్ట్, కార్ పూలింగ్ ను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ కంపెనీల విస్తరణకు లుక్ ఈస్ట్ పాలసీ తెచ్చామని హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో గత పదేళ్లుగా ఐటీ కంపెనీలు విపరీతంగా పెరిగాయని ఈ సందర్భంగా తెలిపారు.

 

KTR launched of JLL Real Estate Consulting Company