Friday, April 19, 2024

ప్రగతి భవన్ పరిసరాలను శుభ్రం చేసిన కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఆదివారం ప్రగతి భవన్ ప్రాంగణంలో ఉన్న పూలకుండీలు,  ఇతర పరిసరాలను మంత్రి కెటిఆర్ శుభ్రం చేశారు. పూలకుండిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. అనంతరం యాంటీ లార్వా మందులను చల్లారు. పది వారాల పాటు ప్రతివారం కనీసం 10 నిమిషాలు పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని కెటిఆర్ ప్రజలను కోరారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలపాటు ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, దోమల నివారణకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని కెటిఆర్‌ సూచించారు.

వచ్చే వర్షాకాలం నాటికి సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని.. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

KTR Launches Cleanliness Drive in Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News