Home తాజా వార్తలు త్వరలో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు.. కెటిఆర్

త్వరలో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు.. కెటిఆర్

KTR

 

రాజన్న సిరిసిల్ల: ఆసరా లబ్ధిదారులకు పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అందజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లను వెయ్యికి పెంచుకున్నమని, ఇప్పుడు రూ. 1000 పింఛన్ ను రూ. 2016లకు పెంచిన్నట్లు కెటిఆర్ తెలిపారు. ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన్నామని, బిడి కార్మికులకు కూడా పింఛన్ ఇచ్చిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని కొనియ్యాడారు. బిడి కార్మికులకు పిఎఫ్ కటాఫ్ తేదీని తొలగించిమని, దీంతో 2 లక్షల మందికిపైగా బిడి కార్మికులకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 17 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ అన్ని రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని, ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాతనేదే సిఎం కెసిఆర్ ధ్యేయమన్నారు.

మండేపల్లితో డబుల్ బెడ్ రూంలు పూర్తయ్యాయి.. త్వరలో లబ్దిదారులకు అందిస్తామని, 1500 డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించి నిరుపేదలకు అందిస్తామన్నారు. సుమారు రూ. 20 లక్షల విలువ గల డబుల్ బెడ్ రూం ఇండ్లను ఉచితంగా ఇస్తున్నామని, ఆశావాహులు ఎక్కువగా ఉన్న చోట లాటారీ పద్ధతిలో ఇళ్లను అందిస్తామన్నారు. ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవరు కూడా ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు.. ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు అందజేశామని సూచించారు. బతుకమ్మ చీరల బకాయిలు త్వరలోనే విడుదల చేయిస్తాన్నాని, రాష్ట్రమే అసూయపడేలా సిరిసిల్ల పట్టణం అభివృద్ధి చెందిందన్నారు. కొత్త చెరువు, కరకట్ట నిర్మాణం, సెంట్రల్ లైబ్రరీ, రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 100 ఎకరాల్లో అపెరల్ పార్కు ఏర్పాటు అవబోతుందని కెటిఆర్ పేర్కొన్నారు.

KTR participated in aasara pensions proceedings program