Home తాజా వార్తలు సెయిల్ వీక్-2018 ప్రారంభోత్సవానికి కెటిఆర్…

సెయిల్ వీక్-2018 ప్రారంభోత్సవానికి కెటిఆర్…

ktr

హైదరాబాద్: జంట నగరాలు 32ఏళ్ల నుంచి సెయిలింగ్ పోటీలకు వేదికగా నిలుస్తున్నాయని ఐటి శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌లో హైదరాబాద్ సెయిల్ వీక్-2018 ప్రారంభోత్సవానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ అద్భుతమైన సరస్సని, గత కొన్ని సంవత్సరాల నుంచి సెయిలింగ్ ఎంతో ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది సెయిలర్లు  ఈ పోటీలో పాల్గొంటున్నారని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం సెయిలింగ్‌కు ఎన్నో ప్రోతాహకాలు ఇస్తోందని గుర్తుచేశారు. ఛాంపియన్ సెయిలర్లకు హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ పోటీల్లో పాల్గొన్నవారు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారని కెటిఆర్ అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఎంతో మంది సెయిలింగ్ ఛాంపియన్స్‌ను తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్ సెయిలింగ్ వీక్, సీనియర్ మల్టీ క్లాస్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్-2018గా ప్రకటిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు.