Thursday, April 18, 2024

కెటిఆర్ మనసు దోచిన ‘సామజవరగమన’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సామజవరగమనపాటు అద్భుతం.. తన మనస్సును మైమరిపించింది.. హృదయాన్ని అత్తుకుంది. వెంటనే ఈ పాట తన ప్లే లిస్టులో చేరింది అంటూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. పాటకు ప్రాణం పోసి సంగీత ప్రియుల హృదయాలను దోచుకున్న సంగీత దర్శకుడు థమన్‌ను ప్రత్యేకంగా అభినందించక ఉండలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ’వాటే బ్రిలియంట్ సాంగ్…’ అని కితాబునిస్తూ థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట తన మదిని వీడటం లేదని అన్నారు. ఈ మేరకు దావోస్ నుంచి ఆయనను ప్రశంసిస్తూ కెటిఆర్ ప్రత్యేకంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్
రాష్ట్రంలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా కెటిఆర్ బిజిబిజిగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రస్తుతం ఆయన దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కెటిఆర్ ప్రయాణించాల్సిన విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నానన్నారు. విమానం వచ్చేంత వరకు తనకు తోడుగా నిలిచిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. వెంటనే తన ప్లే లిస్ట్‌లో చేరిపోయింది. థమన్.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు’ అని కెటిఆర్ పేర్కొన్నారు.

ఆనందంగా ఉంది సార్….
కెటిఆర్ చేసిన ట్వీట్‌పై థమన్ స్పందిస్తూ.. ‘మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్ అవుతుంది సర్’ అంటూ ట్వీట్ చేశాడు. తానకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇటువంటి మెసేజ్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ‘కెటిఆర్ సార్! మీరు మా పాటను మరింత సెన్సేషన్ చేశారు. మీ రోజును తన పాటతో ప్రారంభించారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాం‘ అని ట్వీట్ చేశారు.

KTR Praise on Thaman for Samajavaragamana Song

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News