Friday, April 19, 2024

అశించిన ఫలితం రాలేదు

- Advertisement -
- Advertisement -

KTR press meet about GHMC election results

 

అయినా అతిపెద్ద పార్టీగా టిఆర్ ఎస్ అవతరించింది
జిహెచ్‌ఎంసి పాలకమండలికి మరో 2 నెలల గడువు ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేక పోయిన సింగిల్ పార్టీగా టిఆర్‌ఎస్ మెజారిటీతో నిలిచిందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గత 15 రోజులుగీ టిఆర్‌ఎస్ గెలుపుకోసం కృషిచేసిన వారందరికి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటువేసి ఆశీర్వదించిన గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు ధన్యావాదాలు తెలిపారు. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు, మరో 20 నుంచి 25 సీట్లు స్థానాలు వస్తాయని ఆశించామని కెటిఆర్ చెప్పారు.

ఎన్నికల సరళి పరిశీలించినా, ఎగ్జిట్‌పోల్స్ అన్ని కూడా టిఆర్‌ఎస్ గెలుస్తాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని డివిజన్లలో స్వల్ప మజారిటీ తేడాతో అబ్యర్థులు ఓడిపోయారన్నారు. బిఎన్‌రెడ్డి కాలనీలో మా ఓటమి కేవలం 18 ఓట్ల తేడాతో జరిగింది. అదేవిధంగా మౌలాలీలో 200 ఓట్లు, మల్కాజిగిరిలో 70 ఓట్లు, డిక్‌మెట్‌లో 200 ఓట్లతేడా, మూసా పేటలో 10 ఓట్ల తో అక్కడ విజయం కోల్పొయామన్నారు. ఈ రకంగా 10,12 సీట్లలో రెండు లేదా మూడు వందల ఓట్ల తేడా, అంతకంటే సల్పమైన తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఓటమి చెందింది. మొత్తంగా చూసినట్లయితే చాలా స్వల్పమైన తేడాతో కొన్ని స్థానాలు కోల్పొయినప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. సింగల్ లార్జెస్ట్ట్ పార్టీగా టిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనేక విషయాలను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్లనున్నట్లు కెటిఆర్ తెలిపారు. ప్రతిడివిజన్‌లో టిఆర్‌ఎస్ గెలుపుకోసం శ్రమించిన నాయకులు, సోషల్‌మీడియా వారియర్స్‌కు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరో రెండు నెలల గడువు ఉంది

జిహెచ్ ఎంసి ఫలితాలను పార్టీ పూర్తి స్థాయిలో విశ్లేషించి రాజకీయ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని కెటిఆర్ చెప్పారు. మేయర్ ఎంపిక అంశంలో టిఆర్‌ఎస్ అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిహెచ్‌ఎంసి పాలకమండలికి మరో రెండునెలల సమయం ఉందని కెటిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News