Saturday, April 20, 2024

సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి భారీమెజార్టీ సొంతమైందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్ స్పందించారు. 2014 నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలవల్లే టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధ్యమైందన్నారు. తెలంగాణ భవన్ లో కెటిఆర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ… మున్సిపల్ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యత ను మరింత పెంచాయన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ 100కుపైగా మున్సిపల్ స్థానాల్లో టిఆర్ఎస్ గెలుపొందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరిశీలిస్తున్నారు.

KTR Press Meet Over Municipal Elections Results 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News