Home తాజా వార్తలు నాలుగేల్ల చిన్నారికి క్యాన్షర్ వైద్యం.. స్పందించిన కెటిఆర్

నాలుగేల్ల చిన్నారికి క్యాన్షర్ వైద్యం.. స్పందించిన కెటిఆర్

KTR

 

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో తక్షణం స్పందించే రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ఓ చిన్నారి వైద్యసౌకర్యం కోసం స్పందించి మానవత్వం చాటుకున్నారు. మహబూబ్‌నగర్‌లో తాత ఇంట్లో ఉన్న నాలుగేళ్ల ఉమ్మెహనికి సికింద్రాబాద్‌లో యశోద ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స చేయించాల్సి ఉందని, మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు పాపను తీసుకువచ్చేందకు పోలీసులు పాసు ఇవ్వడంలేదని పాపతండ్రి మోహిన్ కెటిఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గతకొద్దిరోజుల నుంచి చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అవకాశం రావడంలేని వాపోయారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు అనుమతించడంలేదని ఆయన ట్విట్టర్‌లో వివరించారు. అయితే పాపకు అత్యవసరంగా క్యాన్షర్ చికిత్స చేయించాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కెటిఆర్ అత్యవసర వైద్యం కోసం పోలీసులు వాహనాలను అనుమతించాల్సి ఉండగా ఎందుకు అనుమతించలేదని ప్రశ్నిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కెటిఆర్ ఆదేశించారు. కెటిఆర్ ఆదేశాలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో పాప ఉంటున్న ఇంటికి అధికారులను పంపించి వాస్తవాలను పరిశీలించారు. పాపకు అత్యవసరమైన చికిత్స అందించాల్సి ఉందని మంత్రి గమనించి మహబూబ్‌నగర్ ఎస్‌పితో మాట్లాడి వాహనానికి అనుమతి ఇప్పించారు.

వెహికల్‌కు అనుమతి రాగానే పాపతండ్రి మోహిన్ మహబూబ్‌నగర్ నుంచి పాపను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న పాప క్షేమంగా ఉంది. ట్విట్టర్ వేదికగా చేసిన విజ్ఞప్తికి కెటిఆర్ తక్షణం స్పందించి పాపను కాపాడారని ఉమ్మెహని తండ్రి మోహిన్ కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చికిత్స కొద్దిరోజులు ఆలస్యమైనప్పటికీ కెటిఆర్ ఆదేశాలతో అత్యవసర చికిత్స అందడంతో పాప క్షేమంగా ఉందని ఆయన తెలిపారు. ట్విట్టర్‌లో ఇచ్చిన సమాచారానికి అత్యంతవేగంగా స్పందించిన మంత్రి కెటిఆర్‌కు, కెటిఆర్ ఆదేశాలతో తమకు సహకరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పాప కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

KTR responded on four years old child Cancer treatment