Home అంతర్జాతీయ వార్తలు కెటిఆర్ అన్న.. నన్ను కాపాడుండ్రీ

కెటిఆర్ అన్న.. నన్ను కాపాడుండ్రీ

Saudi-Victimహైదరాబాద్: కెటిఆర్ అన్న నన్ను కాపాడండ్రీ… సౌదీలో నన్ను సంపుతుండ్రు. రంజాన్ లో ఉపవాసం నాకు చివరి మాసంగా ఉంది. సౌదీలో ఎజెంట్ మోసంతో నరకయాతన పడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెంది ఎండి సమీర్ అనే యువకుడు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌కు మొరపెట్టుకున్నాడు. బ్రోకర్‌ చెప్పిన మాటలు నమ్మి దేశం కాని దేశం వచ్చానన్నా. సంబంధం లేని పని అప్పగించడంతో ఎడారిలో గొర్రెలు మేపుతూ అవస్థలు పడుతున్నా. ఏజెంటు మోసంతో నరక యాతన అనుభవిస్తున్నాని చెప్పాడు. ఇరవై రోజులుగా సరైన తిండిలేదు. సౌదీలో నన్ను సంపుతుండ్రు. మీరు ఆదుకోకుంటే ఇవే నాకు చివరి రోజులులంటూ ఓ  వీడియోలో సమీర్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. దీనిపై కెటిఆర్ వెంటనే స్పందించారు. సౌదీలో ఉన్న భారత్‌ ఎంబసికి సమీర్‌ గోడును నివేదించి అతను భారత్ కు రావడానికి కెటిఆర్ సాయం కోరారు.

 

ktr responds to saudi victim sameer comment