Home తాజా వార్తలు నేడు సిరిసిల్లలో పర్యటించనున్న కెటిఆర్‌

నేడు సిరిసిల్లలో పర్యటించనున్న కెటిఆర్‌

KTRరాజన్న సిరిసిల్ల: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు సిరిసిల్ల ఎంఎల్ఎ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై కెటిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.

KTR Review Meeting on Bathukamma Sarees At Sircilla