Home తాజా వార్తలు రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై కెటిఆర్ సమీక్ష

రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై కెటిఆర్ సమీక్ష

KTRపెద్దపల్లి : రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్  శాఖ మంత్రి కెటిఆర్ గురువారం సమీక్ష చేశారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సాయపడుతామని ఆయన చెప్పారు. మూసివేతకు గురైన బిల్ట్ వంటి ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉద్యోగవకాశాలు కలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీ అవసరాల మేరకు టాస్క్ ద్వారా యువతకు ప్రభుత్వమే శిక్షణ ఇస్తుందని ఆయన వెల్లడించారు. అన్ స్కిల్డ్ కార్మికులను జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజీ ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కలిపించాలని ఆయన పేర్కొన్నారు. రామగుండంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల మంత్రికి లేఖ రాస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ నేత, రామగుండం ఎంఎల్ఎ చందర్, రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిధి బృందం తదితరులు పాల్గొన్నారు. 

KTR Review On Ramagundam Fertilizers Factory Works