Home తాజా వార్తలు పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలకు కెటిఆర్ దిశానిర్దేశం!

పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలకు కెటిఆర్ దిశానిర్దేశం!

KTR

 

హైదరాబాద్: జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమీక్షించారు. జూన్ 24వ తేదీన పార్టీ కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని, ఈ కార్యక్రమాన్ని మంత్రుల, జిడ్పి చైర్మన్లు చేయనున్నారు. ఈ మేరకు కెటిఆర్ నేడు మంత్రుల, జిడ్పి చైర్మన్లతో ఫోన్ లో మాట్లాడారు. సోమవారం భూమిపూజ నిర్వహించే స్థలాలను పరిశీలించాలని, పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన నిధులు సహా పార్టీ అన్ని విధాల సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను పార్టీ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ మంత్రులు, జిల్లా చైర్‌పర్సన్లకు అప్పగించారు. తొమ్మిది జిల్లాల్లో మంత్రులు, మిగతా జిల్లాల్లో జడ్పీ చైర్ పర్సన్లు కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.

జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసే వారి వివరాలు: కరీంనగర్- మంత్రి ఈటెల రాజేందర్, నిర్మల్ – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాల- మంత్రి కొప్పుల ఈశ్వర్, జనగామ- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూర్యాపేట- మంత్రి జగదీష్ రెడ్డి, మేడ్చల్- మంత్రి మల్లారెడ్డి, మహాబూబ్ నగర్- మంత్రి శ్రీనివాస్ గౌడ్, జోగులాంబ గద్వాల- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆసిఫాబాద్- జెడ్పి చైర్ పర్సన్ కోవాలక్ష్మీ, మంచిర్యాల- జెడ్పి చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ, ఆదిలాబాద్- జెడ్పి చైర్ పర్సన్ రాథోడ్, కామారెడ్డి- జెడ్పి చైర్ పర్సన్ దాపేదార్ శోభ.

సిరిసిల్ల- జెడ్పి చైర్ పర్సన్ అరుణ, పెద్దపల్లి- జెడ్పి చైర్ పర్సన్ పుట్టమధు, జయశంకర్ భూపాలపల్లి- జెడ్పి చైర్ పర్సన్ శ్రీ హర్షిని, మహబూబాబాద్- జెడ్పి చైర్ పర్సన్ అంగోత్ బిందు, ములుగు- జెడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీష్, భద్రద్రి కొత్తగూడెం- జెడ్పి చైర్ పర్సన్ కోరంకనకయ్య, నల్లగొండ- జెడ్పి చైర్ పర్సన్ బండా నరేందర్ రడ్డి, యాదాద్రి భువనగిరి- జెడ్పి చైర్ పర్సన్ సందీప్ రెడ్డి, సిద్దిపేట- జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, మెదక్- జెడ్పి చైర్ పర్సన్ హేవలత, సంగారెడ్డి- జెడ్పి చైర్ పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, రంగారెడ్డి- జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, వికారాబాద్- జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి, నారాయణపేట- జెడ్పి చైర్ పర్సన్ వనజమ్మ, నాగర్ కర్నూల్- జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు.

KTR review on TRS Party office constructions