Home తాజా వార్తలు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందితో కెటిఆర్ సమీక్ష

జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందితో కెటిఆర్ సమీక్ష

KTR

 

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లతో పురపాలక శాఖ మత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కెటిఆర్ తెలిపారు. సిఆర్ఎం కార్యక్రమం కింద నగరంలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణకు టెండర్లు నిర్వహించామని, ప్రస్తుతం రోడ్ల గుంతలు పూడ్చివేత, నూతన రోడ్లు, లేయర్ల వంటి వాటకి వేర్వేరు టెండర్లన్నారు. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సిఆర్ఎం) కింద రోడ్లు, పుట్ పాత్ లు తవ్వాలంటే కనీసం 6 నెలల ముందే సమాచారం అందించాలని చెప్పారు. రోడ్లు తవ్వకాలు వెంటనే పూడ్చే బాధ్యత పూర్తిగా వర్కింగ్ ఏజెన్సీలదే అని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

KTR review with GHMC Engineering Officers