Home తాజా వార్తలు ఫ్యూచర్‌సిటీగా ఓరుగల్లు

ఫ్యూచర్‌సిటీగా ఓరుగల్లు

KTR said warangal will be made future city in future

 

మన తెలంగాణ/వరంగల్ అర్బన్ : భవిష్యత్‌లో వరంగల్ నగరాన్ని ఫ్యూచర్‌సిటీగా చేస్తామని, త్వరలో నగరానికి మెట్రోరైల్ కూడా తీసుకొస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనా వరంగల్ పై ముఖ్యమంత్రి కెటిఆర్కు ప్రత్యేకశ్రద్ధ ఉందని, అదే కమిట్‌మెంట్‌తో అభివృద్ధికి కార్యచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. సోమవారం వరంగల్ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన గ్రేటర్ పరిధిలో రూ. 2579 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్, పశ్చిమ నియోజకవర్గంలోని శాయంపేట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

మాది పనిచేసే ప్రభుత్వం. పేదవాన్ని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వంగా చెప్పారు. గత ఆరేళ్లుగా ఏకపక్షంగా ఎలాంటి తీర్పు ఇస్తున్నారో అదే విధంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అదే తీర్పును ఇవ్వాలని కోరారు. మీ ఆశీర్వాదం, ప్రోత్సాహం ఉంటే మరింత వేగంగా ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. కొంతమందికి కొత్తగా ఇండ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చేది ఉందన్నారు. కరోనా వల్ల 50 వేల కోట్ల ఆదాయం కోల్పోయామని, అయినప్పటికీ పేదోడి సంక్షేమం ఆపలేదని మంత్రి స్పష్టం చేశారు.

వరంగల్‌కు ఒకరోజు ముందే ఉగాది
వరంగల్ పట్ణణ ఆడబిడ్డల దాహార్తిని తీర్చేందుకు ఉగాదికల్లా ఇంటింటికీ స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం రూ. 1589 కోట్లతో పండుగకు ఒకరోజు ముందే 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఒకనాడు బిందెలు పట్టుకుని మహిళలు ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేసేవాళ్లని కానీ కెటిఆర్ పాలనలో నేడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఇప్పుడు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతోందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదోళ్ల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి కొనసాగిస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లలు గర్భం దాల్చితే పనిచేయకుండా ఉండేందుకు మగబిడ్డ కోసం రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు అందజేస్తోందన్నారు.

మాతాశిశు మరణాలు తగ్గించేందుకు సర్కార్ దవాఖానాలో ప్రసవాలు పెంచి కెటిఆర్ కిట్లు పంపిణీ చేస్తోందన్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని దేశాయిపేటలో జర్నలిస్ట్‌ల కోసం రూ. 10.60 కోట్లతో నిర్మిస్తున్న 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించిన అత్యాధునికి సమీకృత మార్కెట్, రూ. 6.24 కోట్లతో నిర్మించినన ఆదర్శ కూరగాయాలు మార్కెట్‌ను ప్రారంభించారు. ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న షాదిఖానా, మండిబజార్‌లో నిర్మిస్తున్న హజ్‌హౌస్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 60 కోట్లతో నిర్మించిన ఆర్‌ఓబీ, అండర్ బ్రిడ్జికి సమాంతరంగా రూ. 7.8 కోట్లతో నిర్మించిన నూతన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లో చిత్తుగా ఓడించాలి
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్ అభివృద్ధిని విస్మరించిన వారు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బిజెపి నాయకులు కోచ్‌ఫ్యాక్టరీ తెస్తామని, గిరిజన యూనివర్శిటీ మంజూరు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వని బిజెపికి తెలంగాణ అభివృద్ధి చేయని కాంగ్రెస్‌కు ఓటేద్దామా? గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న టిఆర్‌ఎస్‌కు ఓటేద్దామా మీరే నిర్ణయించుకోవాలన్నారు. వృద్ధులకు రెండు వేల పింఛన్, గర్భిణీలకు పైసలు ఇస్తునారని, ఎస్సి, ఎస్టిలకు సబ్సిడీ లోన్లు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర రూపురేఖలు మార్చి అందమైన సుందర నగరంగా మర్చాడన్నారు. ఆ రోజ కాకతీయుల పాలించినప్పుడు ఎలా ఉందో నేడు కెసిఆర్ పాలనలో వరంగల్ అదే మాదిరిగా ఉందన్నారు. ఈ సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, తదితరులు పాల్గొన్నారు.

KTR said Warangal city will be made a future city in future