Saturday, April 20, 2024

ఇల్లందును మోడల్ సిటీగా మారుస్తాం: కెటిఆర్ హామి

- Advertisement -
- Advertisement -

Govt may announce unemployment allowance soon

మన తెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పురపాలక సంస్థను మోడల్ సిటిగా మారుస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరంగా పెద్దఎత్తున నిధులు సమకూరుస్తామన్నారు. శనివారం నాడిక్కడ ఇల్లందు పురపాలక సంఘం ప్రజాప్రతినిధలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన ప్రగతి నివేదన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పురపాలికలకు వచ్చే రాబడితో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పెద్దమొత్తంలో నిధులను కేటాయిస్తోందన్నారు. గతంలో ఈ విధంగా నిధులు ఇవ్వని కారణంగానే చాలా పురపాలికల్లోని ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగ లేదన్నారు. కాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అన్ని గ్రామ పంచాయితీలతో పాటు పురపాలికలకు సైతం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఈ నిధులతో పురపాలికల్లో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపి కవిత, ఎంఎల్‌ఎ హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు ఇల్లెందుకు చెందిన పలువురు పురపాలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KTR says will make Illandula as model city

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News