Tuesday, April 23, 2024

కేంద్రాన్ని విమర్శించిన రాష్ట్ర మంత్రి కెటిఆర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు చేయిచేసుకోడాన్ని రాష్ట్ర మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు విమర్శించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది రెజ్లర్లు బైఠాయింపు నిరసన చేపట్టారు.

నిరసన తెలుపుతున్న రెజ్లర్లుతో వ్యవహరించిన తీరును కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క బాధ్యాతాయుత నాయకుడైనా సరే, ఎందుకిలా జరుగుతుందో వివరిస్తారా?’ అని నిలదీశారు. ‘వీరంతా ప్రపంచ స్థాయిలో దేశానికి వన్నె తెచ్చిన ఛాంపియన్లు. వారికి మన మద్దతు, గౌరవం దక్కాల్సి ఉంది’ అని కూడా కెటిఆర్ పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులు ఆదివారం టాప్ రెజ్లర్లు అయిన వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారు కొత్త పార్లమెంటు భవనం వైపు మార్చ్‌కు యత్నించినందుకు నిర్బంధించారు. ఆ తర్వాత వారిపై ‘అల్లర్ల’కు పాల్పడుతున్నారంటూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. విషయమేమిటంటే నిరసనలో భాగంగా రెజ్లర్లు ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’(మహిళల అసెంబ్లీ)ని నిర్వహించాలనుకున్నారు. కానీ వారిపై పోలీసులు చేయిచేసుకున్నారు. బస్సులోకి తోసేశారు. దీనిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఖండించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News