Home తాజా వార్తలు మంత్రి కెటిఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

మంత్రి కెటిఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

 

Minister KTR

 

కోవిడ్19 రీషేప్- సౌత్ ఏషియా ఫ్యూచర్
వర్చువల్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా పిలుపు

మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్న మంత్రి కెటిఆర్
కోవిడ్-19 రీషేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్ అనే అంశంపై సదస్సు
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అందిన ఆహ్వానం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు మరోసారి అలాంటి గౌరవం దక్కింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19కు సంబంధించిన సంక్షోభం నేపథ్యంలో ‘కోవిడ్19 రీషేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్‘ అనే అంశంపైన ప్రసంగించాల్సినదిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కెటిఆర్‌ను నిర్వాహకులు కోరారు. ఈ నెల 30వ తేదీన నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీ బాడీ చెప్పుకోవచ్చు.

సుమారు వంద దేశాల్లో 45 మిలియన్ల సభ్యులు ఈ సంస్థకు ఉన్నారు. ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు అనేక ఇతర ప్రభుత్వ సంస్థలతో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మంత్రి కెటి రామారావు తోపాటు ఈ వర్చువల్ సదస్సులో పలువురు అంతర్జాతీయ డాక్టర్లు, శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖలు భాగస్వాములు కానున్నారు.