Home తాజా వార్తలు జమిలితో ధన ప్రవాహానికి అడ్డుకట్ట: కెటిఆర్‌

జమిలితో ధన ప్రవాహానికి అడ్డుకట్ట: కెటిఆర్‌

KTR speak

 

ఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ హల్ లో అఖిలపక్ష సమావేశం ఐదు అంశాల మీద మా అభిప్రాయం చెప్పామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన చర్యలో ప్రదాని తన అభిప్రాయాలను కూడా చెప్పారని, నవభారత నిర్మాణానికి ఏం చేస్తే బావుంటుందని ప్రదాని అడిగారు. టిఆర్ఎస్ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పామని, కేంద్రం తన అధికారాలను వికేంద్రీకరణ చేయడం ద్వారా ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేస్తూ రాష్ట్రాలను బలోపేతం చేస్తేనే దేశం బలోపేతం అవుతుందని చెప్పామని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తేనే దేశం వేగవంతంగా బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్రం సయోధ్యతో కలిసి రాష్టాలు కూడా చేస్తే 150 స్కూళ్లు, 150 హాస్పిటళ్లు 150 గ్రామాలను ఆదర్శవంతంగా చేస్తే బాగుంటుందని తెలిపారు. ఆకాంక్షిత జిల్లాలను కేవలం ఎంపిక చేయగానే సరిపోదు, ప్రత్యకంగా నిధులు కేటాయించాలని, జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఎన్ని వున్నా ఆహ్వానించదగ్గ నిర్ణయామని, జమిలి ఎన్నికలపై మా వ్యక్తిగతంగా మూడు అనుభవాలను పంచుకున్నాం, దఫదఫాలుగా ఎన్నికలు జరగడం వల్ల కోడ్ సుదీర్ఘంగా అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాలన కుంటుపడుతుందని, వివిధ దశల్లో ఎన్నికలు ఉండటం వల్ల రాజకీయపార్టీలకు ఖర్చు కూడా పెరిగి పోతుంది.

ఎన్నిల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే పరిమిత కాలంలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుటుందని చప్పామని కెటిఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడం కూడా సులభమవుతుందని, కేంద్ర బడ్జెట్ ను బట్టి రాష్ట్ర బడ్జెట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఐదేళ్లపాటు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే ఒకేసారి ఎన్నికలు జరగాలని, జమలి ఎన్నికలపై తొందరేం లేదని ప్రధాని మాతో చేప్పారు. జమలి ఎన్నికల కోసం చట్లసవరణ అవసరమైతే టిఆర్ఎస్ సహకరిస్తుందని తెలియజేశారు.

KTR speak to media after all party meeting