Home తాజా వార్తలు కెసిఆర్‌ను ఏమీ చేయలేరు

కెసిఆర్‌ను ఏమీ చేయలేరు

KTR Speech on kutami in Shankarpally Roadshow

టిఆర్‌ఎస్ పార్టీతో మరింత అభివృద్ధి
కారుకు ఓటేసి దొంగల కూటమికి బుద్ధి చెప్పండి
భారీ రోడ్‌షోలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/శంకర్‌పల్లి: ఒక కెసిఆర్‌ను ఎదుర్కొవడానికి నా లుగు పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నారు కానీ ఎన్ని కూటములు వచ్చిన తెలంగాణ ప్రజలు తగిన రీతిలో జవాబు ఇస్తారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవా రం శంకర్‌పల్లి పట్టణంలో మంత్రి కెటిఆర్ రోడ్‌షోలో నిర్వహించి శంకర్‌పల్లి చౌరస్తాలో మాట్లాడుతూ ఒక్కపార్టీ కెసిఆర్‌ను దించలేమని నాలు గు పార్టీలు కలిసి వచ్చిన కెసిఆర్ లాంటి సింహాన్ని ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలో ఇప్పటి వర కు రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకా లు, అభివృద్ధిని నాలుగున్నర ఎండ్ల లో చేశారన్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణతో అదే ఉద్యమ స్పూర్తితో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రా న్ని బంగారు తెలంగాణ చేయడానికి ముందుకు సాగుతున్నారన్నారు. కరెంట్ అడిగితే రైతులను కాల్చి చంపినోళ్ళు కాంగ్రెస్ వొళ్ళు ఇప్పుడు ఒక్కటయ్యారన్నారు. గతంలో 9 గంటల విద్యుత్ ఇస్తామని 6 గంటలు లేచి అది కూడా ఒకేసారి ఇవ్వకుండా అప్పుడు రెండు గంటలు ఇప్పుడు రెండు గంటలు దొంగలు వచ్చే అర్ధరాత్రికి ఇచ్చేవారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కెసిఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. అలాగె రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ పంటసాగుకు ఎకరాకు 8 వేలు, రైతులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5లక్షల భీమా చేయడం జరిగిందన్నారు. నిన్న నిజామాబాద్ వచ్చిన ప్రధాని మోడికి తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తున్న సంగతి తెలియకపోవడం బాధకరమన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న కెసిఆర్‌ను చేవెళ్ళలో యాదయ్య గెలిపించి పంపి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం  కావాలన్నారు. చేవెళ్ళ తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చూస్తే తెలంగాణ ప్రజలకు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ తెలంగాణ ప్రజలకు కెసిఆర్ దేవుడు అయ్యాడన్నారు. గతంలో 200 రూపాయాల ఫింఛన్, 500ల ఫింఛన్‌ను కెసిఆర్ 1000,1500లుగా చేయడం జరిగిందన్నారు. అలాగే మళ్ళీ అధికారంలోకి రాగానే ఫించన్లు 2016,3016లు పెంచడం జరుగుతుందన్నారు. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు తెచ్చి వారికి లక్ష నూటపదహారు ఇవ్వడంతో వారి జీవితాల్లో వెలుగు నింపారన్నారు.

తెలంగాణ రాష్ట్రం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ అవుతుందన్నారు. మంత్రి కెటిఆర్‌కు చేవెళ్ళ నియోజకవర్గ అభివృద్ధికు 111 జీవొ గుదిబండగా మారిందని ఎత్తివేయాలని కోరకగా కెసిఆర్ పర్యావరణ అధకారులతో మాట్లాడుతున్నారన్నారు. కొద్దిగ సడలించేల కృషి చేస్తానని మంత్రి హమిచ్చారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు శంకర్‌పల్లిలో ఉన్నారని శంకర్‌పల్లి హైదరాబాద్ అతి చేరువలో ఉందని ఇక్కడితో పాటు వికారాబాద్‌కు ఎంఎంటిఎస్ రైళ్ళు పొడిగించాలని కొరగా తప్పకుండా చేస్తానన్నారు. శంకర్‌పల్లి జీహెచ్‌ఎంసి వారు కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళులో శంకర్‌పల్లి ప్రజలకు 50 శాతం వాటా ఇవ్వాలని అడుగగా అలాగే శంకర్‌పల్లిలూ ఎన్‌టిపిసి వారు సేకరించిన 300 ఎకరాలలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టాలని లేకుంటే కాలుష్యం లేని ఐటి పరిశ్రమ నెలకొల్పి ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. దీనికి మంతి కెటిఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మండల పార్టీ అద్యక్షులు డి.వెంకట్‌రెడిడ, మార్కెట్ కమిటి చైర్మన్ రాజు నాయక్, వైస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సొసైటి చైర్మన్ మోహన్‌రెడ్డి, మాజీ ఎంపిపి బిర్ల నర్సిమ్మ, ఎంపిటిసిలు అశోక్ కుమార్, రవీందర్ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి, నాయకులు ఆత్మలింగం, కె గోపాల్, వాసుదేవ్ కన్నా, శ్రీధర్, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

KTR Speech on kutami in Shankarpally Roadshow

Telangana Latest News