Friday, March 29, 2024

వాటర్ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

 

హైదరాబాద్: వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగినవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ జలమండలి అధికారులకు సూచించారు. థీమ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతులను కెటిఆర్ పరిశీలించారు. జలమండలి ఆధ్వర్యంలోని పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. డబ్ల్యుఎఎల్‌సికి సంబంధించిన క్షేత్రస్థాయి రిజిస్టర్‌, జలమండలి సిబ్బంది కోసం ప్రత్యేక యూనిఫామ్ జాకెట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు, ప్రజల్లో వాటర్ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు.  ప్రజల్లో వర్షా కాలానికి ముందే చైతన్యం తీసుకరావాలని డిమాండ్ చేశారు. జలమండలి , తాగునీటి కొరత, వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అని పేర్కొన్నారు.

 

Telangana People Collected rain water says KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News