- Advertisement -
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాల్లో 8 వందల కోట్ల వ్యయంతో చేపట్టిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. ఈ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణకే తలమానికమని తెలిపారు. మంత్రి కెటిఆర్ శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టిఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్ఎ కాలె యాదయ్య, ఎమ్ఎల్ సి పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -