Home తాజా వార్తలు నడ్డా అబద్ధాల అడ్డా…

నడ్డా అబద్ధాల అడ్డా…

KTR

బిజెపి దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి
తెలంగాణ గడ్డ మీద అడ్డగోలు మాటలు చెప్పడానికి
నడ్డాకు సిగ్గు లేదా ..ప్రజలే బుద్ధి చెబుతారు..రాష్ట్రం
పచ్చగా ఉంటే కాంగ్రెస్, బిజెపిలకు నచ్చడం లేదు
.. హైదరాబాద్ పచ్చగా ఉంటే బిజెపికి అసలే నచ్చదు
… ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కెసిఆర్
శ్రమిస్తుంటే ఆ రెండు పార్టీలు అడ్డుపడే ప్రయత్నం
చేస్తున్నాయి : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్,బిజెపి దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పార్టీశ్రేణులకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద బిజెపి నేత నడ్డా అడ్డగోలుమాటలు మాట్లాడడానికి సిగ్గులేదాని ప్రశ్నించారు. కర్ణాటకలో వేసిన నాటకాలు తె లంగాణలో బిజెపి వేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తగిన గుణపాఠంనేర్పుతారని హె చ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ బిజెపి పై నిప్పులు చెరిగారు. ఎవరో అవగాహన లేకుండా రాసిచ్చిన ఉపన్యాసా న్ని జెపి నడ్డా చదవడం సిగ్గులేని వ్యవహారమని దుయ్యబట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడే నడ్డాకు ప్రజలు బుద్దిచెపుతారన్నారు. –దేశాన్ని అనేక సంవత్సరాలు పా లించిన కాంగ్రెస్, బిజెపికి తెలంగాణ ప చ్చబడుతుంటే నచ్చడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుంటే కొంతమందికి న చ్చదు, పంటపొలాలు పచ్చబడుతుంటే మరికొంతమందికి నచ్చదు, హైదరాబాద్ పచ్చగా ఉంటే బిజెపికి అసలేనచ్చదు, పంటపొలాలు పచ్చబడినా, రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చినా, కాళేశ్వరం, నాగార్జు సాగర్ ప్రాజెక్టుల ద్వారా గోదావరిపరివాహక ప్రాంత భూములకు సాగు నీరు అందించినా, రైతులు సుభిక్షంగా ఉన్నా కాంగ్రెస్,బిజెపి నచ్చడంలేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలందరి జీవన ప్రమాణాలను పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తుంటే బిజెపి, కాంగ్రెస్ అభివృద్ధికి అడ్డపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
బిజెపి నాయకుడు జెపి నడ్డా పచ్చిఅబద్దాలుమాట్లాడారని కెటిఆర్ దుయ్యబట్టారు.కనీసం ఒకనిజం కూడా చెప్పలేని స్థితిలో నడ్డాఉన్నారని హేళన చేశారు. ఆయన మైకు తీసుకుని ఎవరో రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని నోటికి వచ్చినట్లు మాట్లాడారని కెటిఆర్ విమర్శించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మరికొంతమంది నాయకులు బిజెపి పక్షాన ప్రచారంచేసినా 119 శాసనసభ స్థానాల్లో 103 నియోజకవర్గాల్లో బిజెపి డిపాజిట్లు కొల్పొయిన అంశాన్ని నడ్డా గుర్తుంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. సిఎం కెసిఆర్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందనే భరోసాతో మరోసారి ప్రజలు కెసిఆర్ పక్షాన నిలిచారనే వాస్తవాన్ని తెలుసుకోకుండా సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అదోగతిపాలుచేశారని నడ్డా మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా ఉందన్నారు.టిఆర్‌ఎస్ పార్టీకి ప్రాణవాయువు కార్యకర్తలేనని ఆయన చెప్పారు. కష్టపడే పార్టీ సభ్యులకు తగిన సమయంలో గుర్తింపు ఉంటుందన్నారు.
బిజెపి నాటకాలను సాగనీయం
తెలంగాణలో బిజెపి కర్ణాటకమాదిరిగా రాజకీయం చేయాలని ప్రయత్నించినా, నాటకాలు వేయాలని ప్రయత్నించినా, కర్ణాటకలో బిజెపి పన్నిన పన్నాగాలను ఇక్కడ అమలుచేయాలన్నా తెలంగాణ ప్రజలు సహించరని నడ్డాకు కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు ఆరితేరినవారని నడ్డాను కెటిఆర్ మందలించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని కెటిఆర్ గుర్తు చేశారు. బిజెపిపాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్కరాష్ట్రంలోనైనా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందా? రైతుల సంక్షేమంకోసం పథకాలు అమలవుతున్నాయా? పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీని బిజెపి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని కెటిఆర్ నడ్డాను ప్రశ్నించారు. భారతదేశంలో 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేణని ఆయన చెప్పారు. వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులకు సంవత్సరానికి రూ.12వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన చెప్పారు. వేలాధికోట్ల సంక్షేమ పథకాలు అమలువుతున్నా కైంద్రం నుంచి రాజ్యాంగబద్దమైన నిధులు మినహా అభివృద్ధికోసం ఒక్కపైసా కూడా రావడంలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సొంతనిధులతో అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణకు ఏమాత్రం సహాయం చేయడంలేదని కెటిఆర్ నిందించారు.
బిజెపి మతాలమధ్య చిచ్చుపెడుతోంది
టిఆర్‌ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో బిజెపి మతాలమధ్యచిచ్చుపెట్టి ఆమంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తుందని కెటిఆర్ తీవ్రంగా ఆరోపించారు.ప్రశాంతమైన వాతావరణాన్ని చెరిపివేసేందుకు బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్,బిజెపిల హయాంలో హైదరాబాద్‌లో మతచిచ్చులు రగిలిపోయాయని ఆయన చెప్పారు. అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రశాంత వాతావరణాన్ని నెల కొల్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయని ఆయన అన్నారు. కూకట్‌పల్లిలో కూడా ఆంధ్ర తెలంగాణ ఘర్షణలు జరుగుతాయని కాంగ్రెస్, బిజెపి విషప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. అయితే కూకట్‌ల్లి ప్రజలంతా టిఆర్‌ఎస్ పక్షంలో నిలబడటంతో బిజెపి,కాంగ్రెస్,టిడిపిలకు మతిస్థిమితం తప్పిందని నిందించారు. మతసామరస్యం,కులాలకు గౌరవం టిఆర్‌ఎస్ పాలనలోనే దక్కిందన్నారు. కులాలమధ్య, మతాలమధ్య బిజెపి చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు.టిఆర్‌ఎస్ ప్రతిఘటిస్తోందని కెటిఆర్ బిజెపిని హెచ్చరించారు.
నకల్ మార్నేకేలియే అకల్ చాహియే
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ చేసినా పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని కెటిఆర్ విమర్శించారు. నకల్‌మార్నేకేలియే అకల్ చాహియే అంటూ కేంద్రానికి కెటిఆర్ హితవు చెప్పారు. రైతుబంధును పిఎం కిసాన్ అంటూ మిషన్‌భగీరథను జల్‌శక్తి అభియాన్ అంటూ ఆరోగ్యశ్రీని ఆయుస్మాన్ భారత్ అంటూ ప్రధానిమోడి ప్రకటించారే కాని ఆపథకాల స్వరూపాన్ని అమలువిధానాన్ని పూర్తిస్థాయిలో ప్రధాని మోడి కాపీ చేయలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌పథకం కంటే ఉన్నతమైందని కెటిఆర్ వివరించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలుచేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భవించిందే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించుకోవడానికేనని ఆయన ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న బిజెపికి స్పష్టం చేశారు.
గొంతు చించుకోవడం కాదు ఆధారాలతో నిరూపించాలి
మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని బిజెపి గొంతు చించుకోవడంకాదు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కెటిఆర్ బిజెపికి సవాల్ విసిరారు. మాట్లాడటంకాదు ప్రజాక్షేత్రంలో నిరూపించాలని కెటిఆర్ కాంగ్రెస్,బిజెపిలకు చెప్పారు. గతంలో కూడా ఒకాంగ్రెస్ నాయకుడు అవినీతీ, అవినీతంటూ గొంతు చించుకున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం గీసుకోనన్నారు ఆపార్టీ అధికారంలోకి రాలేదు ఆయన గడ్డంకూడా అలాగే పెరిగిపోతుందని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రజలకు మంచి చేసింది కాబట్టే మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా బిజెపి ప్రభుత్వం హైదరాబాద్‌కు ఒక్కమంచిపనైనా చేసిందాని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తుంటే బిజెపినాయకులు విమర్శిస్తున్నారన్నారు.
దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి
బిజెపి దుష్ప్రచారాన్ని,కుట్రలను, కుతంత్రాలను ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులను కెటిఆర్ ఆదేశించా రు. బంగారుతెలంగాణ సాధనకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఫలితాలను సాధిస్తుంటే పనిలేని నడ్డాలాంటి నాయకులు అ సత్య ఆరోపణలతో ప్రజల్లోకి వెల్లుతున్నారని ఆయన చె ప్పారు. మతం, కుల రాజకీయాలతో ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణను బంగారుతెలంగాణగా హైదరాబాద్‌ను విశ్వనగరిగా తీ ర్చిదిద్దే ప్రభుత్వ కృషిని బిజెపి,కాంగ్రెస్ అడ్డుకునే ప్ర యత్నం చేస్తే పార్టీశ్రేణులు తగిన రీతిలో స్పందించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. 50లక్షల సభ్యులతో ఉన్న ఏకై క పార్టీ టిఆర్‌ఎస్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశా రు. పార్టీ ఆదేశాలమేరకు సభ్యత్వం పూర్తిచేసి కమిటీల ను ఏర్పాటుచేసిన కూకట్‌పల్లి మిగతా నియోజకవర్గాల కు ఆదర్శంగా నిలుస్తోందని కెటిఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గాంలో ఏర్పాటైన 50 కమిటీల సభ్యులు, రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గౌడ్, శాసనమండలి సభ్యులు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

KTR Strong Warning To BJP Leader JP Nadda