Home తాజా వార్తలు టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్‌

టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్‌

KTRహైదరాబాద్‌ : టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ఎంపిలు, సభ్యత్వ నమోదు ఇన్ ఛార్జిలతో కెటిఆర్ మాట్లాడారు. ఈ నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ క్రమంలో పట్టణాలు, నగరాల్లో సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. పట్టణాలు, నగరాల్లోని విద్యావంతులు, వృత్తి నిపుణులు పార్టీ సభ్యత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు. సభ్యత్వ నమోదుపై యువత ఆకర్షితులవుతుందని, ఈ క్రమంలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆన్ లైన్ ద్వారా కూడా సభ్యత్వ నమోదును నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో పార్టీ సభ్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే మున్సపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏకపక్షంగా గెలిచేందుకు ప్రతి నేత, కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన చెప్పారు. పార్టీ కోసం పని చేసేవారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

KTR Teleconference on TRS Membership Registration