Friday, March 29, 2024

ఫ్రెంచ్ సెనెట్‌లో ప్రసంగించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR to address French Senate

ఫ్రాన్స్ నుంచి విశిష్ట ఆహ్వానం

ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్టు కొవిడ్ అంశంపై ఈ నెల 29న ఫ్రెంచ్ సెనెట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా వేదిక నుంచి ప్రసంగించవలసిందిగా కోరుతూ ఆహ్వానం

ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా21 సదస్సులో ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావుకు తాజాగా మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. ఫ్రెంచ్ ప్రభుత్వం తమ సెనెట్లో ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది.

ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్-… ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని మంత్రి కెటిఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. యాంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్‌గా గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్’ అనే అంశంపైన తన అభిప్రాయాలు పంచుకోవాల కెటిఆర్‌ను కోరింది. గతంలో నిర్వహించిన యాంభీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా కం పెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఈసారి కూడా అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలా ంటి కీలకమైన వేదికపైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని కెటిఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన ప్రత్యేక సమావేశాలను ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు ఫ్రెంచ్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని కెటిఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపు

ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చిన ఆహ్వానం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశ ఆహ్వానం… తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News