Saturday, April 20, 2024

శానిటేషన్ సిబ్బందిని ప్రజలకు పరిచయం చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్: నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోతే పదవులు పోతాయాని ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో జిల్లాలో బాయ్స్ కాలేజ్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మెట్టుగడ్డలోనూ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కౌన్సిలర్లు బాధ్యత తీసుకొని.. శానిటేషన్ సిబ్బందిని ప్రజలకు పరిచయం చేయాలని, వార్డులో పనిచేసే శానిటేషన్ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్ గోడలపై రాయాలన్నారు. వార్డులకు సంబంధించిన పారిశుద్ద్య ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మన నగరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామని.. పొడి, తడి చెత్తలను వేరుచేసేలా ప్రజలను చైతన్యం పరచాలని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

KTR to begins development programs in Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News