Saturday, April 20, 2024

నేడే ఖమ్మంలో ఐటి హబ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

KTR to inaugurate Khammam IT Hub on Monday

ఖమ్మం: హైద్రాబాద్ మహానగరం తరువాత ద్వీతియశ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా తొలి అడుగుగా నేడు ఖమ్మం నగరంలో ఐటీ హాబ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ఈ హాబ్ ప్రారభానికి భారీ ఏర్పాట్లు చేశారు. కెటిఆర్‌తోపాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహబుబ్ అలీ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జిల్లాకు చెందిన రాష్ట రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. ఐటీ హాబ్‌తో పాటు ఖమ్మం నగరంలో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధ్ది పనులకు సైతం మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు.

ఖమ్మానికి మేటి.. ఐటి హాబ్

ఖమ్మం నగరానికి ఐటీ హాబ్ మణిహారం కాబోతుంది. హైద్రాబాద్, వరంగల్ తరువాత ఐటీ కంపెనీలు ఉన్న నగరాల్లో ఇప్పుడు ఖమ్మం చేరనుంది. రూ.25 కోట్ల వ్యయంతో 41178.52వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. ముందుగా 25వేల వైశాల్యంలో నిర్మించాలనుకున్నప్పటికి ఐటీ కంపెనీల నుంచి స్పెస్ కోసం వచ్చిన డిమాండ్‌తో నిర్మాణ వైశ్యాల్యాన్ని పెంచాల్సి వచ్చింది. ఇప్పటికే 19 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిచ్చుకుంది. 430 వర్క్‌స్టేషన్లు సిట్టింగ్ సౌకర్యం కల్పిస్తూ కొన్ని వేల మీటర్లో వైరింగ్ చేస్తూ ప్రత్యేకంగా ఈ ఐటీ హాబ్‌ను నిర్మించారు. 2017జూన్‌లో దీనికి శంకుస్థ్దాపన జరిగింది. ఐటీ కంపెనీలనుంచి స్పందన విశేష స్పందన రావడంతో ఫేజ్ 2తో అదనపు భవవం నిర్మాణానికి కూడా నిధులు మంజురు అయ్యాయి. మొత్తం అయిదు అంతస్థుల భవనంలో ఐటీ హాబ్‌ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో టాస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని పథకాలకు ప్రారంభోత్సహాలు

ఐటీ హాబ్‌తోపాటు కొన్ని దశబ్ధాలుగా అమలుకునోచుకోని అనేక కార్యక్రమాలకు నలుగురు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ధంసలాపురం (అగ్రహారం)రైల్వే ఓవర్ బ్రిడ్జితోపాటు, నూతన పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, బల్లెపల్లిలో పట్టణ వైకుంఠధామం,రఘునాధపాలేంలో మినీట్యాంక్ బండ్, ఖానాపురంలో మినీ ట్యాంక్ బండ్, రఘునాధపాలేం…చింతగుర్తి బిటి రోడ్డు వెడల్పు, పాండురంగాపురం కోయచల్క క్రాస్ రోడ్డు బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైండర్, లైటింగ్, ఎన్ ఎస్ పి కెనాల్ వాక్‌వే, ఇంధిరానగర్‌లో మున్సిపల్ పార్క్, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పనుల నుమంత్రులు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లకారం ట్యాంక్ బండ్ వద్ద మాజీ ప్రధాని పివి నర్సింహ్మరావు, ధంసలాపురం ఆర్ వో బి వద్ద ప్రొపెసర్ జయశంకర్ విగ్రహాలను కూడా మంత్రులు ఆవిష్కరిస్తారు.

ఘనంగా స్వాగతానికి విస్తృత ఏర్పాట్లు

రాష్ట్ర టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి అయిన కల్వకుంట్ల తారకరామారావుతోపాటు మొత్తం నలుగురు మంత్రుల ఖమ్మం నగరానికి విచ్చేస్తుండటంతో వారికి ఘన స్వాగతం పలకడానికి టిఆర్‌ఎస్ శ్రేణులు నిర్ణయించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అతి పెద్ద పార్టీగా నిలిపిన అనంతరం తొలి పర్యటనగా ఖమ్మం నగరానికి విచ్చేస్తున్న యువనేత కెటిఆర్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగాఅభినందించాలని నిర్ణయించారు. దీనికి తోడు ఖమ్మం నగర కార్పోరేషన్‌కు అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందునా మంత్రుల పర్యటనను తమకు అనుకులంగా మాల్చుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది.అటూ అగ్రహరం గేట్ నుంచి ప్రకాశ్ నగర్ మీదుగా ఖమ్మం నగరం మీదుగా రఘునాధపాలేం వరకు నలుగురు మంత్రులు సుడిగాలి పర్యటన చేయనున్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముగిసిన తరువాత చివరగా ఐటి హాబ్ ప్రారంభం అనంతరం అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి కార్యకర్తలనుపెద్ద ఎత్తున్న తరలించాలని నగర పార్టీ నిర్ణయించింది సర్ధార్ పట్టేల్ స్టేడియం నుంచి ద్వీచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News