Home జాతీయ వార్తలు మోడీ సరసన కెడి ఎంఎల్‌ఎ ఫోటో

మోడీ సరసన కెడి ఎంఎల్‌ఎ ఫోటో

MLA-Kuldeep-Singhఉన్నావ్ : ఉత్తరప్రదేశ్‌లో ఒక పత్రికా ప్రకటన దుమారం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెలువడ్డ ప్రకటనలో ప్రధాని మోడీ ఇతర ప్రముఖ నేతలు వీరితో పాటు ఎంఎల్‌ఎ కుల్దీప్ సింగ్ సెన్‌గర్ ఫోటో కూడా ప్రముఖంగా చోటుచేసుకుంది. బంగార్‌మావూ నియోజకవర్గం నుంచి బిజెపి ఎంఎల్‌ఎగా ఎన్నికైన సెనెగర్ ఒక బాలిక అత్యాచా రం కేసులో కీలక నిందితుడు. పైగా రాయ్‌బరేలీ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఉన్నావ్ స్థానిక బిజెపి నేత ఒకరు నేతలను ఆకట్టుకునేందుకు ప్రకట న వెలువరించాడు. ఇందులో తన సందేశం, మోడీ, అమిత్ షా, ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్, యుపి బిజె పి నేత స్వతంత్ర దేవ్ సింగ్, వీరితో పాటు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ఫోటో లు, వీరందరి సరసన ప్రముఖంగా జైలులో ఉన్న ఎంఎల్‌ఎ, పక్కన ఆయన భార్య జడ్‌పి ఛైర్మన్ అయి న సంగీతా ఫోటో కూడా వచ్చేలా చేశారు.

స్థానిక ప్రముఖ దినపత్రికలో ఈ యాడ్‌ను ఉంగూ నగర్ పంచాయతీ అధ్యక్షులు అనుజు కుమార్ దీక్షిత్ వెలువరించారు. వివాదాస్పద ఎంఎల్‌ఎ నియోజకవర్గం పరిధిలోకే ఉంగూ వస్తుంది. సెన్‌గర్ వల్లనే దీక్షిత్ బిజెపిలోకి రావడంతో గురుభక్తిని చాటుకోవడానికి పడ్డ తాపత్రయం ఇప్పుడు రాద్ధాంతానికి దారితీసిం ది. తాను ఈ ప్రకటన వెలువరించడాన్ని కుమార్ దీక్షిత్ సమర్థించుకున్నారు. ఆయన తమ ప్రాంత ఎంఎల్‌ఎ కావడంవల్ల బిజెపి నేతలతో పాటు ఆయన ఫోటో వచ్చేలాచేశామని తెలియచేసుకున్నారు. ప్రస్తు త యాడ్ వివాదం తమకు అంటకుండా యుపి బిజె పి వారు జాగ్రత్త చర్యలకు దిగారు. ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని యుపి బిజెపి ప్రతినిధి ఒక రు చెప్పారు.

అత్యాచారం కేసులో నిందితుడు అయి న ఎంఎల్‌ఎను తాము చాలా కాలం క్రితమే పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి వర్గాలు తెలియచేసుకుంటూ వస్తున్నాయి. ఎవరో వారి ఇష్టం మేరకు ఎంఎల్‌ఎ ఫోటో వాడినట్లుగా అనుకుంటున్నామని, ఈ చర్య కానీ ఈ ప్రకటనతో బిజెపికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేద ని పార్టీ ప్రతినిధి వివరణకు దిగా రు. ఏడాదిగా జైలులో ఉంటున్న సెన్‌గర్ పట్ల ఇటీవలే హర్దోయి బిజె పి ఎంఎల్‌ఎ అశిషు సింగ్ అశూ సానుభూతి వ్యక్తం చేశారు. సెన్‌గర్ ప్రస్తుత గడ్డు పరిస్థితినుంచి గట్టెక్కాలని కోరుకుంటున్నానని ప్రకటన వెలువరించడం బిజెపిని చిక్కుల్లోకి నెట్టింది. దీనిని మరింత బిగింపచేసేలా ఇప్పటి ప్రకటన వెలువడింది.

అత్యాచార ఘటనలో జైలులో ఉన్న ఎంఎల్‌ఎపై కేసు ఇటీవలే మరింత బిగుసుకుంది. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబంతో పాటు కారులో వెళ్లుతుండగా అనుమానాస్పద స్థితిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితురాలి మేనత్తలు ఇద్దరు మృతి చెందారు. బాలిక, ఆమె లాయర్ తీవ్ర గాయాల పాలయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. యాక్సిడెంట్ ఘటనకు సంబంధిం చి సిబిఐ వారు ఎంఎల్‌ఎపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Kuldeep Sengar Seen In Independence Day Poster With PM