Thursday, July 17, 2025

రోహిత్ స్థానంలో కుల్దీప్ యాదవ్.. కారణం ఇదే..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ స్థానాన్ని కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఆక్రమించాడట. అంటే అది జట్టులో కాదు.. టీం బస్సులో. ఈ విషయాన్ని కుల్దీప్ స్వయంగా వెల్లడించాడు.

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో కుల్దీప్ యాదవ్‌ను (Kuldeep Yadav) ఇంగ్లండ్ సిరీస్‌లో తుది జట్టులో తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లండ్‌లో కుల్దీప్‌కి అంత మంచి రికార్డు లేదు. ఇంగ్లండ్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడిన ఈ స్పిన్నర్ తొమ్మిది ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీయలేదు. కానీ, ఇప్పుడు అతను జట్టులో ఉండటం తప్పనిసరి అయింది. అయితే టీం బస్సులో రోహిత్ శర్మ (Rohit Sharma) కూర్చొనే సీటులో కుల్దీప్ కూర్చుకున్నాడట. ఎందుకంటే ఆ పక్కనే రవీంద్ర జడేజా కూర్చోవడం వల్ల అతను ప్లేస్ మారానని చెప్పాడు.

రోహిత్ శర్మ స్థానాన్ని తాను ఎప్పుటికీ భర్తీ చేయలేనని.. కేవలం బస్సులో అతని సీట్లో కూర్చుటున్నానని అన్నాడు. ‘‘జడ్డూ భాయ్‌ (జడేజా)తో ఎక్కువ సేపు మాట్లాడేందుకే సీటు మారాను. అశ్విన్ జట్టులో లేనందున.. స్పిన్నర్‌గా జడేజాతో చర్చలు జరపడం అవసరం. జడేజా నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. నా కెరీర్ ఆరంభంలో వీరిద్దరితో కలిసి ఆడాను. ఇప్పుడు జడేజా నాకు జోడీగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని కుల్దీప్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News