Home జాతీయ వార్తలు ప్రాంతీయ పార్టీలు ఒకతాటిపైకి రావాలి: కుమార స్వామి

ప్రాంతీయ పార్టీలు ఒకతాటిపైకి రావాలి: కుమార స్వామి

 

కోల్‌కతా: రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకతాటిపైకి రావాలని కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కుమార స్వామి మాట్లాడారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. కర్నాటకలో రైతు రుణమాఫీని విఫలం చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి, ర్యాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బిజెపి పాలన సాగుతోందని, అందుకనే బిజెపిని నామరూపాలు లేకుండా చేద్దామన్నారు. ప్రజల అవసరాలు మోడీ ప్రభుత్వానికి కనపడడం లేదని, అందుకే బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని కర్నాటక ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

 

Kumara Swamy Comments on Modi