Friday, July 18, 2025

కర్నూల్‌లో ఓ వ్యక్తిని నరికి చంపి… కాళ్లను ఊరేగించారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శేషన్న(54) అనే వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు శేషన్న ఇంట్లోకి చొరబడి అతడిపై కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంరతం మృతుడి కాళ్లు నరికి గ్రామంలో ప్రదర్శించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News